చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: వేటూరి
గానం: మాళవిక, రేవంత్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డి
నిర్మాత: మారుతి
విడుదల తేది: 07.07.2013
****** ****** ******
ఈ పాట పచ్చని కాపురం (1985) సినిమా నుండి రీమిక్స్ చేయబడింది.
నటీ నటులు: క్రిష్ణ , శ్రీదేవి
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి
****** ****** ******
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు
నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము
చరణం: 1
జ్ఞాపకమేదో నీడల్లో తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళు దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ నాదైనదీ
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోనా
వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
చరణం: 2
అంతం లేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి
బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా
ఇంటిదీపమాయే జంట ప్రేమ
********* ********* *********
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: దీపు, రమ్యా బెహ్రా
కొత్తగున్నా హాయె నువ్వా
మత్తుగున్నా మాయె నువ్వా
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ
కొత్తగున్నా హాయె నువ్వా
హే మత్తుగున్నా మాయె నువ్వా
యు ఆర్ మై హనీ లవ్ యు హనీ కమ్ టు మి బేబీ ఓ బేబీ
అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్నలేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలపులు పిలుపుతో
తెలవనీ మలుపులో
తెలిసినా తలపులో
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
మత్తుగున్నా మాయె నువ్వా
తనననా త త త త త త
చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవే
కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
Touch me not touch me not
Touch me not touch me not
Touch me not touch me not
Touch me not touch me not
తడబడే తపనలో
జతపడే తనువులో
********* ********* *********
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక, రేవంత్
నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా
నాతో ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళో పరిగెడుతున్నా
నాలా ఉన్నదే నే నీవా .. నీలో ఉన్న నీవే నేనా
బాగున్నదే ఎదేమౌతున్నా ఓ…
I just love you baby…
You r my heart come to me jaana tooo
Can you be my baby…
Feel you what i do we know jaana toooo
చరణం: 1
చూస్తున్నా చేరువేయ్యదురా కలా
దాగున్నా నా ఊహనే నిజంగా ఇలా
ఎదురుగ ఉంటే కుదురుగ లేనే
ఏమైందో ఏదో ఏదో మాయలా
జతే చేరాలంటూ మదే కోరింది ఏదో గతంలా …
నువ్వే కావాలంటూ మరీ ఆగిందీ ఎదే ఈ వేళా ..
కుదరదుగా
చరణం: 2
నీవుంటే రోజులే క్షణంలా అలా…
నీవెంటే సాగేనులే అలల్లా ఎలా ..
అలసిపోతున్నా హాయిగా ఉందే
నిదురలో మువ్వల్లే గురుతుగా
నువ్వే నచ్చావంటూ కథే రేగింది సడే గుండెల్లో …
అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ ఒళ్ళో …
జరగదుగా
********* ********* *********
చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)
సంగీతం: J.B
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లిప్సిక
ఓ మై లవ్… ఓ మై లవ్… మై లవ్ మై లవ్…
ఓ మై లవ్… ఏ చోట ఉన్నా
నీడల్లే నీవెంట ఉన్నా
నన్నే నేను నీలో చూస్తు వున్నా
ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా
ఏదోలా నీ తోడు కానా…
నువ్వే లేని నేనే నేను కానా
నాలోనూ దాగున్న నీ ప్రేమ… నీదాక చేరేది ఎలా
మై లవ్ ఓ… మై లవ్ ఓ… ఓ మై లవ్…
చరణం: 1
కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే
నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే
నీవేగా నీవేగా నీవేగా…
నా చుట్టూ నీవేగా ఇలా…
మై లవ్ ఓ… మై లవ్ ఓ…
ఓ మై లవ్…
చరణం: 2
నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే
నీవున్నావన్న ధ్యాసే
నన్నే నడిపిస్తుందే
అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే
నీవేగా నీవేగా నీవేగా…
నేనంటూ నీవేగా ప్రియా…
మై లవ్ ఓ… మై లవ్ ఓ… ఓ మై లవ్…