చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కె.
నటీనటులు: ఆది, ఇషా చావ్లా
దర్శకత్వం: కె. విజయ భాస్కర్
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 25.02.2011
సనిరీస సనిరీస
నిసరీసా నిసరీసా
దనిప మపదనిసా
సనిరిసా సనిరిసా
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ…
చరణం: 1
విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా
తన ఆడుకొనేదొక బొమ్మైనా
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడేది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే… ఓ… ఓ…
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ…
చరణం: 2
వెలుతురు ఉన్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా
ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోరా ఇటు చేరా
నువు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే… ఓ… ఓ…
మనసంతా
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ…
******** ******* ********