చిత్రం: ప్రేమ ఖైది (1990)
సంగీతం: రాజన్- నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కవితా కృష్ణమూర్తి
నటీనటులు: హరీష్ , మాలశ్రీ, శారద
దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణ
నిర్మాత: డా౹౹. డి. రామానాయుడు
విడుదల తేది: 1990
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం ప్రాణం ఓ..ఓ..
ఉగాదులు ఉషస్సులు వలపున రాక
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలిచితిని బదులిక లేక
నీవే జతలేని శిధిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్లు చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
దిగులు పడే సొగసులతో దినములు సాగే
రుచులడిగే వయసులలో ఋతువులుమారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరువులు తీసే
చెరి సగమౌ చెలిమినిలా చెరలకు తోసే
ప్రేమ ఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్లీ ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగార వీణ శివరంజని
పిలుపందుకున్న ప్రియ రంజని
నువ్వే ప్రాయం – ప్రాణం – ఓ.. – ఓ..