Prema lekha (1996)

Advertisements

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఆర్.కృష్ణారాజ్, భువనచంద్ర
నటీనటులు: అజిత్ కుమార్, దేవయాని, హీరా రాజగోపాల్
దర్శకత్వం: అగతియాన్
నిర్మాత: శివశక్తి పాండియన్
విడుదల తేది: 12.07.1996

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేలే కన్నెఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ ఆశగ ఏదో మాటాడాల
ఏంకావాలో చెవిలో చెప్పెయ్ చిన్నమ్మా
ఓ .. సింగపూరు సెంటు చీర జీనూపాంటు గాజువాక
రెండోమూడో  ఇళ్ళిస్తానే బుల్లేమ్మా
ఊరి ముందర మేళం పెట్టి పూలమేడలో తాళిని కట్టి
నా పక్కన వుండక్కర్ల జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరుముద్దులు ఇస్తావా
నీ తలంపే మత్తేక్కిస్తుందే .. బడబడబడమని
నామస్సుని తోందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే ఓ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా

చూసి చూడకుండా వెళ్ళె పడుచు పిల్లలార
ఈ ప్రేమికుడివంక కాస్త కళ్ళుతెరచి చూడండోయ్..
రెండుకాళ్ళమీదా లేసి నిలబడి కళ్ళళ్ళో కళ్ళు పెట్టిచూసారంటే
మోహమొచ్చి మైకంలో పడిపొతారోయ్

సిగ్గు లజ్జ మానం అన్నీ మరిపించేదే నాగరికత
ఎనిమిదిమూరల చీరాలెందుకు చిన్నమ్మా
ఆ .. వంకాయ్ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్ ఐపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
పేస్ కట్ కి ఫెయిర్ & లవ్లీ జాకెట్ కి లోకట్ డైలీ
లోహిప్ కీ నో రిప్లై ఏలమ్మా
లాకెట్టులో లారాకాంబ్లీ  నోట్ బుక్లో సచిన్ జాక్సన్
హెయిర్  కట్ కు  బ్యూటీపార్లర్  ఏలమ్మా

నీతలంపే మత్తేక్కిస్తుందే .. బడబడమని
నా మనసుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే గడగడమని
తట్టినన్ను లాగేస్తున్నాయే   ఓ .. ఓ .. ఓ ..

చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
చిన్నదానా ఓసి చిన్నదానా
ఆశపెట్టేసి పోమాకె కుర్రదానా
కళ్ళూ అందాలకళ్ళు కవ్వించేనే కన్నెఒళ్ళు
చిన్నా రైలులోన చిక్కాయిలే చీనిపళ్ళు

*******   *******   *******

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర , ఉన్ని కృష్ణన్

నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ

కళ్ళు కళ్ళు మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరి పోయేనమ్మా
నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా
ఆడించి పాడించి అనురాగం కురిపించీ
అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ
కవ్వించేదే ప్రేమా
ప్రేమలకు హద్దు లేదులే
దాన్ని ఎవ్వరైన ఆపలేరులే

నీ పిలుపే ప్రేమగీతం

జాతి లేదు మతము లేదు
కట్నాలేవి కోరుకోదు ప్రేమా
ఆది లేదు అంతం లేదు
లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో
అడగదు నిన్ను ప్రేమా
నాలోనా నీవుండి నీలోనా నేనుండి
జీవించేదే ప్రేమా
జాతకాలు చూడబోదులే
ఎన్ని జన్మలైనా వీడిపోదులే

నీ పిలుపే ప్రేమగీతం
నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై
కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ
కవ్వించని కవ్వించని కవ్వించనీ

*******   *******   *******

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: వందేమాతరం శ్రీనివాస్

దిగులు పడకురా సహొదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా
యమ్మా యమ్మా యమ్మా యమ్మా
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమేకదమ్మా

Advertisements

చరణం: 1
గాంధీ స్టాచ్యూ ప్రక్కనేచూసిన ప్రేమవేరురా
జగదాంబ ధియేటర్లో నేచూసిన ప్రేమవేరురా
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్‌ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే . . . ఓహొ . . .
నేనాటో ఎక్కి తిరుగుతుంటే తాలోపడ్డడంటరా
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళలోనే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా

చరణం: 2
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా
చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా
ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ
బస్‌ష్టాండ్‌లో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే . . . ||ఓహొ||
నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా
ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో

*******   *******   *******

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: స్వర్ణలత

పట్టూ పట్టు పరువాల పట్టు కట్టూకట్టు సొగసైన కట్టు
ఒట్టూ ఒట్టూ ఎదపైన ఒట్టూ చుట్టూ చుట్టూ చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరు చిలకనురా నను పలుచన చేయకురా

చరణం: 1
ఎదే నదై తరించదా నీమాటలు వింటే
రతి మతి చలించరా నీరూపం కంటే
ఒంపు సొంపు అంటించుకుంటా ముద్దు ముచ్చటేపంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా నాలో నిన్ను దాచేసుకుంటా ||2||
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా

చరణం: 2
అనుక్షణం తపించరా నిను చూడని కళ్ళు
ప్రతిక్షణం భరించెనా వసివాడిన వళ్ళు
మనసే నిన్నుకోరింది గనుక మత్తే హత్తుకొమ్మంది గనుక
ముద్దే నన్ను మురిపించి ముత్యం నీవై వేచి ఉంటానుసత్యం ||2||
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా

*******   *******   *******

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, అనురాధ శ్రీరామ్

ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా

కోవేలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన అందించరాదా
నినుకాక లేఖలనే పెదవంటుకోదా
వలపులు నీ దరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
నీ తలపుతోనే నే బ్రతుకుతున్నా
ప్రియా నిను చూడలేక
ఊహలో నీ రూపు రాకా

*******   *******   *******

చిత్రం: ప్రేమలేఖ (1996)
సంగీతం: దేవా
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2)
అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే
కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

మనసంతా మనసంతా మరుమల్లెల పులకింత
వయసంతా వయసంతా చిరుకవితల కవ్వింత (2)
ఏ ఊరి చల్లగాలి ఈ ఊరికొచ్చెనమ్మా
ఒంటె మీదకెక్కి నన్ను ఊరు చుట్టు తిప్పెనమ్మ
ఏటిగట్టు ఊరిగట్టు నన్ను చూసి పాడంగా
సంగతులు ఎన్నెన్నో వంతులేసి చెప్పంగా
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

ఆకాశం ఆకాశం ఈ సుందర ఆకాశం
బహుదూరం బహుదూరం మనకందని నవలోకం (2)
చుట్టి చుట్టి నన్ను చుట్టె చక్కనైన తోకచుక్క
ముద్దు ముద్దు మాటలాడె ముచ్చటైన పాలపిట్ట
అందాలే చిందెనులే లేత నుదుటి కుంకుమలు
పగ్గాలే వేసెనులే నీలి నీలి ముంగురులు
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను (2)
అమ్మమ్మా అందాలే ఏనుగెక్కి పోతుంటే
కలల్లో కొంటెగా సైగలేవో చేస్తుంటే
రాజస్తానీ కన్నెపిల్ల వయసుకి వన్నెలు వచ్చిన వేళ
ఎరుపు లోలాకు కులికెను కులికెను
ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను

Advertisements

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Speedunnodu (2016)
error: Content is protected !!