చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
దర్శకత్వం: కె.యస్. ప్రకాష్ రావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 24.09.1971
తేట తేట తెలుగులా… తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
తేట తేట తెలుగులా… తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా..ఆఅ..
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాల వలె నాలో
పలికినది….. పలికినది…. పలికినది
చల్లగా చిరుజల్లుగా… జల జల గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచిందీ కనుల ముందరా
తేట తేట తెలుగులా… తెల్లవారి వెలుగులా…
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవీ..ఈ..
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు
వెలసినవి….. వెలసినవి… వెలసినవి…
వీణలా.. నెరజాణలా… కల కల.. గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
ఎదుట నిలిచింది కనుల ముందరా
తేట తేట తెలుగులా… తెల్లవారి వెలుగులా…
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ (2)
నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి (2)
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి (2)
తెల్లవారితే వెనకనజేరి నవ్వుకుంటాయి డోంట్ కేర్
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది
మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి
మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికె చేతులు వస్తాయి (2)
ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి డోంట్ కేర్
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది
మనిషిని మనిషి కలిసేటందుకె పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకె మధువులు ఉన్నాయి
బాధలన్ని బోటిల్లో నేడే దింపేసెయ్ (2)
అగ్గిపుల్లా గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసెయ్
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను మరువనివ్వదు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ… సుఖము లేదంతే….
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ… సుఖము లేదంతే… మనసు గతి ఇంతే
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ…
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసీ వలచి విలపించుటలో…. తియ్యదనం ఎవరికి తెలుసూ…
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతి ఇంతే
మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా… దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా…
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ… సుఖము లేదంతే… మనసు గతి ఇంతే
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల
నీకోసం… నీకోసం…
నీకోసం వెలిసింది ప్రేమ మందిరం
నీకోసం విరిసింది హృదయ నందనం
ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది
ప్రతి తీగ నీ ఒంపులు తెంచుకున్నది
ప్రతి పాదున నీ మమతే పండుతున్నది
ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది
నీకోసం విరిసింది హృదయ నందనం
అలుపు రాని వలపును ఆదుకునే దిక్కడ
చెప్పలేని తలపులు చేతలయే దిక్కడ
చెడిపోని బంధాలు వేసుకునేదిక్కడ
తొలిచే మీ అనుభవాలు తుది చూసేదిక్కడ
కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు
శిల వంటి మనిషిని శిల్పంగా చేసావు
తెరవని నా గుడి తెరిచి దేవివై వెలిసావు
నువ్ మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి
నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి
మూల దాగి ధూళి మూగి
చరణం: 1
మూగవోయిన మధుర వీణా
మరిచిపొయిన మమత లాగా
మమత లుడిగిన మనసులాగా
మాసిపో… తగునా…
చరణం: 2
ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని కళలను దాచినావో
కొనగోట మీటిన చాలు _ నీలో
కోటి స్వరములు పలుకును…
చరణం: 3
రాచనగరున వెలసినావు రసపిపాసకు నోచినావు
శక్తి మరచి, రక్తవిడిచి మత్తు ఏదొ మరిగినావు
మరిచిపోతగునా…
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల
కడవెత్తుకొచ్చింది కన్నె పిల్లా
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు
వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు
చరణం: 1
పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి
పిడికిడంత నడుము చుట్టూ
పైట కొంగు బిగగట్టి వెళుతుంటే
చూడాలి వెళుతుంటే చూడాలి
దాని నడక అబ్బో
ఎర్రెత్తిపోవాలి దాని ఎనక
చరణం: 2
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన కండరాలు
బిరుసైన కండరాలు
మెరిసేటి కళ్ళ డాలు
వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి
వాడి సోకు
ఆడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు
చరణం: 3
తలపాగా బాగ చుట్టి ములుకోలు చేతబట్టి
అరకదిమి పట్టుకుని మెరక చేనులో వాడు
దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి
వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది
వయసు పోరు
చరణం: 4
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ
వొంగింది చిన్నది ఒంపులన్ని వున్నది
చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తానంటే కాళ్ళ కాడ
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, యల్. ఆర్.ఈశ్వరి
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
లేలేలే నా రాజా లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
చరణం: 1
పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
వచ్చి వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
హాయ్…పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది
రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
చరణం: 2
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి హహ హహ
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా హా చక్కని చుక్కా హా అప్పుడు ఇవ్వాలి
రా రా రా రా.. నా రోజా రావే నా రోజా
రా.. నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
రాతిరయ్యిందా హా నన్ను లేచిరమ్మందా హా
లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా
********* ********* *********
చిత్రం: ప్రేమనగర్ (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల
ఉంటే యీ వూళ్ళో వుండు
పోతే మీ దేశం పోరా
చుట్టుపక్కల వున్నావంటే
చూడకుండా ప్రాణం వుండదురా…
చరణం: 1
కూలికెళ్తే నాకే రారా చేను వున్నాది
కూడు తింటే నాతో తినరా తోడు వుంటాదీ
ఇంకేడకైనా ఎల్లావంటే
నాది చుప్పనాతి మనసు అది నీకు తెలుసు
ఒప్పి వూరుకోనంటది…
చరణం: 2
ఊరి నిండా వయసు పిల్లలు _ ఒంటిగున్నారు
వాటమైన వాణ్ణి చూస్తే _ వదలనంటారు
నీ చపలబుద్ది సూపావంటే
మనిషి నాకు దక్క వింక మంచిదాన్ని కాను ఆనక…
చరణం: 3
పగటి పూట పనిలో పడితే _ పలకనంటావు
రాతిరేళ రగస్సెంగ రాను జడిసేవు
నే తెల్లవార్లు మేలుకుంటే…
ఎర్రబడ్డ కళ్ళుచూసి
ఏమేమొ అనుకుని ఈది కుళ్ళుకుంటది…