చిత్రం: ప్రేమ యుద్ధం (1990)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి
నటీనటులు: నాగార్జున, అమల, వాణీ విశ్వనాధ్
దర్శకత్వం: యస్. వి. రాజేంద్రసింగ్ బాబు
నిర్మాత: పి. విజయ కుమారి
విడుదల తేది: 23.03.1990
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో

నిండే దొసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే

నిండే దొసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే
ముసురేసిందమ్మా కబురై కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపీ
జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మా తనువు తనువు కలిపి తనతో సగమే చెరిపీ
చాలిగాలేం చేస్తుంది చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో
ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో
కురిసిందీ వాన తొలిగా పరువాన
స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో
నిండే దొసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే
మతిపోయిందమ్మా మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ
జలపాతం నీవైతే అలగీతం నేనేలే
కసిరేగిందమ్మా కలతో నిజమే కలిసి దివిని భువిని కలిపీ
సిరితారలు తెస్తాలే నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో
ఈ తపనలకే జత కలిసే తలపులతో