చిత్రం: ప్రేమకువేళాయెరా (1999)
సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, హరిణి
నటీనటులు: జే. డి. చక్రవర్తి, సౌందర్య
దర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డి
నిర్మాత: తరంగ సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 06.08.1999
ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ…
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ… పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా…అఆ…
మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ తాకింది నాజన్మ పొంగింది
పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక..
పంచదారల ప్రేమచినుకా…అఆ…
నాతేనె విందువు నువ్వే నాలంకె బిందెవు నువ్వే
నాగుండె గంపలోనా ఒంపుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నాచెంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది
పంచవన్నెల రామచిలుక
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ… పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుకా.ఆఅ..
ఓ పంచదారల ప్రేమచినుకా..ఆఆఆ…