చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)
సంగీతం: గంటాడి కృష్ణ
సాహిత్యం:
గానం: హరిహరన్, గోపిక పూర్ణిమ
నటీనటులు: దీపక్ , అంకిత
దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
నిర్మాతలు: బి.ఏ. రాజు, జయ
విడుదల తేది: 13.12.2003
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకి రాగం సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడన
జావళీలు పాడుకోనె జాగరాలు చేయన
నీ తడిసిన పెదవిని పెడవులతో
నే ముద్దుల ముద్రే వేయన
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
తుమ్మెద నీవై రమ్మని పిలిచే కమ్మని రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో నీ జంటై నేనుంటాలే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా