Premante Idera (1998)

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , స్వర్ణలత
నటీనటులు: వెంకటేష్ , ప్రీతీ జింటా
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాతలు: బూరుగపల్లి శివరామకృష్ణ , కె.అశోక్ కుమార్
విడుదల తేది: 30.10.1998

నైజాం బాంబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీ
సేవలను పొందండి చేసుకోండి

జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ

ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు

*********   *********   *********

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో , స్వర్ణలత

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదాతీరగా ఊయంటనుగా
మనల్నే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డేలేదుగా

ఇద్దరికీ వద్దిక కుదరక
ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా

రెప్పలలో నిప్పులే నిగనిగ
నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా

*********   *********   *********

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: రమణగోగుల

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో

సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

*********   *********   *********

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఓ ఊహకందని భాషా నేర్చుకోమనసా
ఓ సామిరారా ప్రేమంటే ఇదేరా
నాసితారా ప్రేమంటే ఇదే రా

రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదేరా

తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
పాడమంది ప్రేమంటే ఇదేరా
రాయమందీ ప్రేమంటే ఇదే

*********   *********   *********

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

మనసే ఎదురు తిరిగి మాటవినదు
కలిసే ఆశ కలిగి కునుకు పడదే
మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు
తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు

కలలో మొదటి పరిచయం గురుతు ఉందా
సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా
చెలివైన చెంగలువా అలలోనే నీ కొలువా
చెలిమైన వెన్నెలవా నిజమైనా నా కలవా
నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా

చినుకై కురిసినది కదా చిలిపి సరదా
అలలై ఎగసినది కదా వలపు వరద
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా
వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా

*********   *********   *********

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏమో ఎక్కడుందొ కుసే కొయిల
నాతొ ఎమిటందొ ఉహించెదెల
ఎదలొ ఊయల ఊగె సరిగమ
ఏదొ మాయల అలె మధురిమ
ల ల ల లా ల ల లా ల లా ల ల
ల ల ల లా ల ల లా ల లా ల ల

Your email address will not be published. Required fields are marked *

Previous
Raja (1999)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Aakaasam Nee Haddhu Ra Songs Telugu Lyrics
Aakaasam Nee Haddhu Ra (2020)
error: Content is protected !!