Premikula Roju (1999)

Premikula Roju (1999)

చిత్రం: ప్రేమికుల రోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: ఉన్ని కృష్ణన్
నటీనటులు: కునాల్ , సోనాలి బింద్రే
దర్శకత్వం: కథిర్
నిర్మాత: ఏ. యమ్.రత్నం
విడుదల తేది: 1999

రోజా… రోజా…
రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…
రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…

నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే

రోజా… రోజా… రోజా… రోజా…

కన్నులలో… కొలువున్నావులే…
రాతిరిలో… కనులకు కునుకే లేదులే…
వలువగ నన్నూ చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా
నీ పేరు నానోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే
వానలో నువు తడవగా నా కొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా

రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా

నవ యువతీ… నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రలు మంచులో
దూరాలేలా జవరాలా బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే  చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా

రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా… రోజా రోజా…

*******  *******  *******

చిత్రం: ప్రేమికుల రోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: యస్.పి.బాల సుబ్రహ్మణ్యం , స్వర్ణలత

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్మూ నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

ఆ… ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా
అహ నిన్నటి దాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందెను ముఖం ముఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
అల లాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం
విరహానికైనా దొరకని బంధం

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

*******  *******  *******

చిత్రం: ప్రెమికులరోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం: ఉన్నిమీనన్

వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలుక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలుక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోన
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

*******  *******  *******

చిత్రం: ప్రెమికులరోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం: శ్రీనివాస్, శ్రీకుమార్

మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
నీ వరుడు రేపు వేంచేస్తాడు

తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా

ఆ… మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు
మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం….
మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే

కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
ఈ పేద హృదయమే దీవించ పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం….

మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే
గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ

*******  *******  *******

చిత్రం: ప్రెమికులరోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం: రాజన్, యుగేంద్రన్, ఫెబి

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా
లా లల లా లల లా లల లా లల లా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా
సాగరానికీ… ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ… ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల
లా లల లా లల లా లల లా లల లా

మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెట్టిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా
కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి
ఓ మరియా ఓ మరియా…………

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా

సాగరానికీ… ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ… ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల

అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్
మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఫ్రూట్ చెలియా నా దునియా
ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా

సాగరానికీ… ఫిషింగ్ నెట్
ప్రేమించడానికీ… ఇంటర్నెట్
దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా
మరియా మరియా మరియా మరియా

*******  *******  *******

చిత్రం: ప్రెమికులరోజు (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం: ఉన్ని మీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

నిన్ను చూసి నన్ను నేను మరిచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆ మాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలు మాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా
ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాడెపోవునంట

నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
నా ప్రేమ – నీవేలే, నా ప్రేమ – నీవేలే…

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా

ప్రేమ చూపులో ఉంది మహత్వం
ప్రేమ భాషలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం
ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం
ఓ.. ఓ.. ఓ..నా మనససు నీలో దాచి ఉంచినాను
ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను

ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం

నా ప్రేమ – నీవేలే, నా ప్రేమ – నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..

మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..

1 thought on “Premikula Roju (1999)”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top