చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, జానకి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , భానుప్రియ
దర్శకత్వం: వంశీ
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 1985
పల్లవి:
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
ముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహ
ముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
చరణం: 1
రాదారంత రాసలీలలు
అలూ అరూ ఇనీ
రాగాలైన రాధ గోలలూ
అలూ అరూ ఇనీ
రాధా…అ…ఆ…ఆ
రాధా బాధితున్నిలే ప్రేమారాధకున్నిలే
ఆహాహా…ఆ..
జారుపైట లాగనేల రా – అహహ
ఆరుబైట అల్లరేల రా – ఆహ ఆ…
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
ముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహ
ముద్దు కావాలా – మ్మ్ , ముద్ద కావాలా – ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
చరణం: 2
వెలిగించాలి నవ్వుమువ్వలు
అలా అలా అహ హ
వినిపించాలి మల్లెగువ్వలూ
ఇలా ఇలా ఇలా
తారా…అ…ఆ..ఆ..
చూపే లేత శోభనం మాటే తీపి లాంఛనం
ఆహాహ…ఆ…
వాలు జల్ల ఉచ్చులేసినా – ఆహా
కౌగిలింత ఖైదు వేసినా – ఆహా..ఆ
ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయిల్లె ఉండనా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
ముద్దు కావాలి – మ్మ్ , ముద్ద కావాలి – ఆహాహ
ముద్దు కావాలి – మ్మ్ , ముద్ద కావాలి – ఆహాహ
ఆ విందా ఈ విందా నా ముద్దూ గోవిందా
గోపెమ్మ చేతిలో గోరు ముద్దా – మ్మ్
రాధమ్మ చేతిలో వెన్నముద్దా – మ్మ్
చిత్రం: ప్రేమించు పెళ్ళాడు,
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే
మందారములా మరందములే
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే
మందారములా మరందములే
చరణం: 1
హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం
ఆకశానికవి తారలా
ఆశకున్న విరి దారులా
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే
మందారములా మరందములే
చరణం: 2
అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు గొలిచి పౌష్యమే వెళ్ళిపోయే..
మాఘ దాహలలోనా అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా
మనసులోని మరుదివ్వెలా
ఈ సమయం రసోదయమై
మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే
మందారములా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగ పండే
నిరంతరము వసంతములే
మందారములా మరందములే
చిత్రం: ప్రేమించు పెళ్ళాడు,
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
చరణం: 1
విడిపోలేనీ విరి తీవెలలో
ఉరులే మరులై పోతుంటే హోయ్
ఎడబాటేదీ ఎదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
చరణం: 2
గళమే పాడె అల కోయిలలే
వలచీ తెలిపే నా గీతం హోయ్
నదులై సాగే ఋతు శోభనమే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే హోయ్
వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపనా
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
ఈ చైత్రవీణా ఝుం ఝుమ్మనీ
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా