చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్, అంజలీ జవేరి
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: డి. సురేష్ బాబు
విడుదల తేది: 09.05.1997
(గమనిక: ఇందులోని మూడు పాటలు మణిశర్మ గారు కంపోజ్ చేశారు
కానీ నాకు అవి ఏవి అని తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు)
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నా మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ
ఒళ్ళోవాలే అందాల అప్సరస
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
అల్లేసింది నీ మీద నా ఆశ
ఆ…ఆ…ఆ…
తొలిసారి నిను చూసి మనసాగక
పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ
తెలుగంత తీయంగ నువ్వు పలికావే స్నేహంగా
చెలిమన్న వలవేసి నను లాగగా
చేరాను నీ నీడ చల చల్లగా
గిలిగింత కలిగేలా తొలి వలపంటే తేలిసేలా
హా కునుకన్న మాటే నను చేరక
తిరిగాను తేలుసా ఏం తోచక
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఆ…ఆ…ఆ…
తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత
ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా
నిజమేదో కల ఏదో మరిపించగా
పగలేదో రేయేదో రెండు కలిశాయి నీ చెంత
ప్రేమంటే ఇంతే ఏమో మరి
దానంతు ఏదో చూస్తే సరి
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలి రేపింది నాలో నిష
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ…
అల్లేసింది నీ మీద నా ఆశ
మేఘాలే తాకింది హాయి హైలెస్స
నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
********* ********* *********
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, అనురాధా శ్రీరామ్
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ
నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా
కన్నె శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా
సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
********* ********* *********
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
చరణం: 1
ప్రతీ జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా
అదే పాట నాదాకా ఎలా చేరెనమ్మా
ప్రతీ బాట నావైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ ఊసేదో నను రమ్మన్నది
ప్రతీక్షణం నీ ధ్యాసేగా కలవరించి
వరించి రతించుతున్నది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
చరణం: 2
అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా
వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కధే ఇది
సుఖాల తీరం కోరే మన ప్రయానమివాళ
ఫలించు క్షణమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
********* ********* *********
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర
అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
నీడలాగ తోడు ఉంటా పారిజాతమా
గుండెలోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చరణం: 1
నీ వాకిట ముగ్గునౌతా సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా
నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా
నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చరణం: 2
ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా
ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా
నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా
సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
ఆ నుదుటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను
మల్లె పూల మీద ఒట్టు మాట దాటను
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడరా
చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడరా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
********* ********* *********
చిత్రం: ప్రేమించుకుందాంరా (1997)
సంగీతం: మహేష్ మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర , స్వర్ణలత
పెళ్లికళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా
తద్దినక తాళం ఉంది ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
జంటపడు వేళయ్యింది ఆజా ఆజా
పెళ్లికళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
చరణం: 1
అక్షితలు వేసేసింది షాదీ
అడ్డు తెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం లేజా లేజా
జానేమన్ ఏ దుల్హన్ కో లేజా లేజా
మై డియర్ హబ్బీ ముజ్కో లేజా లేజా
ఆశపడు అందం చందం లేజా లేజా
అక్షితలు వేసేసింది షాదీ
అడ్డు తెర తీసేసింది షాదీ
చరణం: 2
ఆలుమగలైపోయామే భామా
అసలు కధ భాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా
మల్లెలతో మంచం సిద్దం దేఖో దేఖో
అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో
మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో
ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో
ఆలుమగలైపోయామే భామా
అసలు కధ భాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా