ప్రేయసి కావు.. నేస్తం కావు… లిరిక్స్
చిత్రం: వెన్నెల (2005)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: రవివర్మ
గానం: సుదీప్ , సైందవి, రజిని, దేవన్
నటీనటులు: రాజా, పార్వతి మెల్టన్, శర్వానంద్, రవివర్మ
దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాణం: రవి వల్లభనేని, సచి పినగపని, చలపతి మన్నూరు
విడుదల తేది: 26.11.2005
ప్రేయసి కావు.. నేస్తం కావు..
గుండెల్లో నిండున్నావు..
గుప్పెట్లో దాగున్నావు..
చీకట్లో వెలుగిస్తావు..
జగమంతా కనిపిస్తావు..
పండుగ నీవు.. నా పచ్చిక నీవు.. ||2||
చరణం: 1
మోహమే.. మంటగా రగులుతున్నా..
లోకమే.. నీవుగా మునిగివున్నా..
గాలిలో.. ఈ కల తేలుతున్నా..
నీటిలో.. రాతలా చెదిరివున్నా..
నీ శ్వాసకోసం మానై ఉంటా..
నీ మాటకోసం మునినై పోతా..
నీ చూపు కోసం శిలనై ఉంటా..
నీ నవ్వుకోసం అలుసై పోతా..
జాబిలికే.. వెన్నెల నీవు..
సూర్యునికే.. వేకువ నీవు..
ఊపిరిలో.. ఉష్ణం నీవు..
ఊరించే.. తృష్ణం నీవు..
శూన్యం నీవు.. నా శ్రోకం నీవు.. ||2||
చరణం: 2
వేసవి వర్షమై కురిసిపోవా..
వెచ్చని వేకువై వెలిగిరావా..
మాటతో రూపమై తరలిరావా..
నిర్ణయం చెప్పి నన్నాదుకోవా..
నీ తోడుకోసం ఆవిరైపోనా..
నీ స్పర్శకోసం చినుకై రానా..
నీ అడుగు తాకి గుడినైపోనా..
నీ గుండెలోకి సడినై రానా..
నీలానికి నింగివి నీవు..
కాలానికి గమ్యం నీవు..
చలనానికి శక్తివి నీవు..
భావానికి మూలం నీవు..
ఎవ్వరి కోసం.. ఈ జాబిలి వేషం..
కమ్మని కావ్యం. ఈ వెన్నెల దీపం..
ఎవ్వరి కోసం.. ఈ జాబిలి వేషం..
కమ్మని కావ్యం.. ఈ వెన్నెల దీపం..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
movie; chanakya sapadham songs; mellaga mela mellagaa, vedi veri valapulu song lyrics please.