Preyasi Raave Lyrics

Preyasi Raave (1999)

Preyasi Raave Lyrics

నీ కోసం నీ కోసం జీవించా చిలకా… లిరిక్స్

చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి
దర్శకత్వం: చంద్రమహేష్
నిర్మాణం: డా౹౹ డి. రామానాయుడు
విడుదల తేది: 19.11.1999

నీ కోసం నీ కోసం జీవించా చిలకా..
నా ప్రాణం నీ వేనే మణితునకా..
నా కోసం నా కోసం నిన్నే నా జతగా..
ఏ దైవం పంపేనో బహుమతిగా..
నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా..
కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా..
మిన్నూ  మన్నూ ఏకంచేద్దాం హరివిల్లుగా..

నా కోసం నా కోసం నిన్నే నా జతగా..
ఏ దైవం పంపేనో బహుమతిగా..

నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం
నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి
నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నె దేహం
తరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి
పరులకు ఎన్నడు తెలియని చల్లని చలిమితో
ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ..
విరహపు వేడికి కనబడక విడవని జోడుగ ముడి పడగా
అల్లే ఈ బంధం కలకాలముండి పోనీ..

నీ కోసం నీ కోసం జీవించా చిలకా..
నా ప్రాణం నీ వేనే మణితునకా..

కాసేపైన కల్లోనైనా నీ ఊహ లేని
క్షణాలు ఉన్నాయా, ఒంటరి తనాలు ఉన్నాయా..
ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపు లోనే..
ప్రతీది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా..
మమతలు చిందిన మధువులు విందుకు
అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ..
అలలకు అందని జాబిలిని వెన్నెల వానగ దించుకొని
గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోనీ..

నా కోసం నా కోసం నిన్నే నా జతగా..
ఏ దైవం పంపేనో బహుమతిగా..
నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా..
కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా..
మిన్నూ  మన్నూ ఏకంచేద్దాం హరివిల్లుగా..

ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ
ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ ఆఆఆ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

తెంచుకుంటె తెగిపోతుందా… లిరిక్స్

చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: ఎస్.పి. బాలు
నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి
దర్శకత్వం: చంద్రమహేష్
నిర్మాణం: డా౹౹ డి. రామానాయుడు
విడుదల తేది: 19.11.1999

తెంచుకుంటె తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం॥2॥
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం
ఏడు అడుగులు నడిచిన వాడే
ఏడు జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు
అతని హృదయం నాతి చరామి!
అగ్ని హోత్రమె అందుకు హామి॥2॥

తెంచుకుంటె తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం

శ్రీవారిని పూజించాలి
చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి
తరగని మురిపాలతో
దాసి నీవై ప్రేయసి నీవై
నీవే తన ప్రాణమై…
నిండు ప్రేమను తనకందించు
నూరేళ్లూ నడిపించు
పతి ఆరోగ్యమే.. సతి సౌభాగ్యమై..
ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
ఎన్ని జన్మలైనా..

మగని హృదయం మమతల
నిలయం మగువకే దేవాలయం॥2॥

తెంచుకుంటె తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం

తెగువతో తన పతి ప్రాణాలే
తిరిగి తెచ్చును ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని
అనుసరించును ఇల్లాలే
చెదిరిపోని నుదుటి రాతకు
శ్రీకారం దంపతులే…
గాయం ఏ ఒక్కరిదైనా
కన్నీళ్లూ ఇద్దరివే…
పగలు రేయిగా.. బ్రతుకే హాయిగా..
కలకాలమూ నిలవాలి మీరు
పసుపు కుంకుమలుగా..

ఆలుమగలే సృష్టికి మూలం
వారికే తల వంచును కాలం॥2॥

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మేనకవో ప్రియ కానుకవో… లిరిక్స్

చిత్రం: ప్రేయసి రావే (1999)
సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
సాహిత్యం: డా॥వెనిగళ్ల రాంబాబు
గానం: ఎస్.పి. బాలు, ఎం.ఎం. శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి
దర్శకత్వం: చంద్రమహేష్
నిర్మాణం: డా౹౹ డి. రామానాయుడు
విడుదల తేది: 19.11.1999

మేనకవో ప్రియ కానుకవో
అలరించే అభిసారిఖావో
మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా చిందించు ప్రేమా
మేనకనే ప్రియ కానుకనే
అలరించే అభిసారికనే
నిలిచిందిలే నీ చంతనే సరసాల స్వప్నసీమ
చిందించు ప్రేమా  అందించు ప్రేమా

అందిఅందని చందమామ
ఎన్ని అందాలు నీలో దాచావమ్మా
చిందే అందాల విందుకోసం
మకరందాలు నీకై దాచానయ్య
నా రాణివై పారాణివై అలివేణివై రావే
తెరతీయవా దరిచేరవా చిరుగాలివై నీవే
సరసాలనే శృతిచేయగా సరదాగ సాగుదామా
చిందించు ప్రేమా  అందించు ప్రేమా

మేనకవో ప్రియ కానుకవో
అలరించే అభిసారికవో
మురిపించవే మురిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా
చిందించు ప్రేమా

నిన్నే ఈ కన్నె కోరుకుంది తన చిన్నారి మనసే నేదంది
నీమీద ఆశపెంచుకున్నా ఇక నీతోనే జీవితమనుకున్నా
చెలి గుండెలో కొలువుండిపో తొలిప్రేమలా నీవే
పులకింతవై పూబంతివై ఓ ప్రేయసి రావే
ఆకాశమే మనకోసమే సృష్టించె ప్రాణయలోకం

అందించు ప్రేమా చిందించు ప్రేమా
మేనకనే ప్రియ కానుకనే
అలరించే అభిసారికనే
మురిపించవే మరిపించవే పరువాల స్వర్గసీమ
అందించు ప్రేమా
చిందించు ప్రేమా

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Komaram Puli (2010)
error: Content is protected !!