చిత్రం: ప్రియ (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల, జానకి
నటీనటులు: చంద్రమోహన్ , చిరంజీవి , రాధిక, స్వప్న
దర్శకత్వం: యస్.పి.చిట్టిబాబు
నిర్మాత: యం. రాయప్పరాజు
విడుదల తేది: 20.03.1981
చిత్రం: ప్రియ (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల, జానకి
నా హృదయమా నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా
అందమై మకరందమై
మందబంధ మలయానిత గంధమై
మదనుని విరివిల్లున అరవిందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై
పులకరించు కుసుమమా
పులకరించు కుసుమమా
నా హృదయమా
నా హృదయ ఉదయ రాగమా
ఆటవై సయ్యాటవై
చిలిపి వలపులాడే చెలగాటమై
తలపుల తత్తరల తచ్చాటవై
పరువాల సరదాల బూచాటవై
పరువాల సరదాల బూచాటవై
కరిగిపోవు స్వప్నమా
కరిగిపోవు స్వప్నమా
నా హృదయమా
నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా
వాణివి వర వీణవై
బృందావన సమ్మోహన వేణువై
పదకవిత మృదుబాషల బాణివై
అనురాగ రాగాల నెరజాణవై
అనురాగ రాగాల నెరజాణవై
గానమై మౌనమా గానమై మౌనమా
గాలివై చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల వేళవై
కనుసన్నల తెలివెన్నెల జాలువై
జోజోల ఉయ్యాల జంపాలవై
జోజోల ఉయ్యాల జంపాలవై
సేదదీర్చు నేస్తమా సేదదీర్చు నేస్తమా
నా హృదయమా
నా హృదయ ఉదయ రాగమా
మాయనీ తీయనీ మధుర గీతి పాడుమా