చిత్రం: ప్రియా..ప్రియతమా (2011)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు
నటీనటులు: భరత్, తమన్నా, సపన్ శరన్
దర్శకత్వం: ఆర్. కన్నన్
నిర్మాత: భద్రకాళి
విడుదల తేది: 16.09.2011
ఎదనింగీ మేఘమే తానూ
స్వరగంగా రాగమే తానూ
పగలొచ్చే తారకే తాను
తానేలే నా చెలియా
హరివిల్లు చిన్నెలే తాను
విరిజల్లు చినుకులే తాను
వెదజల్లే వెన్నెలే తాను
తానేలే నా చెలియా
చూసేటీ కన్నులున్నవి
కన్నులకు మాట రాదులే
మాటాడే పెదవులున్నవి
పెదవులకు కళ్ళులేవులే
తను నేనే తను నేనే
ప్రేమించా ప్రేమించా
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
ఎదనింగీ మేఘమే తానూ
స్వరగంగా రాగమే తానూ
పగలొచ్చే తారకే తాను
తానేలే నా చెలియా
కన్నులు రెండూ కలగను వేళా లేలెమ్మనే
లేచేసరికి దూరం జరిగి పోపొమ్మనే
దూరంగున్నా విరహంలోనా రారమ్మనే
తానే దోచీ మళ్ళీ నన్ను మనసిమ్మనే
తను చెంతకు చేరగనే నా నీడే రెండాయే
తన పేరె వినగానే గిలిగింతే మెండాయే
పెదవులు సుధలే కురిసినవీ
పులకింతల్లో మురిసినవీ
నను చంపేసిందీ చూపుతో
నను బతికించిందీ నవ్వుతో
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
గిల్లీ గిల్లీ ముల్లులాంటీ చూపేసిందీ
అల్లిబిల్లీ అల్లరితోటీ ఊపేసిందీ
వెల్లువంటీ ఆశలు నాలో రేపేసిందీ
అల్లుకుపోగా ఆగాలంటూ ఆపేసిందీ
తానుంటే వేసవులే వెన్నెలలై విచ్చునులే
తనులేకా వెన్నెలలే వేసవులై గుచ్చునులే
లోకంలోనా తానే ఒక అద్భుతమూ
హాయ్ తనకే జీవితం అంకితమూ
తన కాలికి మువ్వై మోగనా
తన పెదవుల నవ్వై సాగనా
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ
తానే తానే నా చెలీ