చిత్రం: ప్రియమైన నీకు (2001)
సంగీతం: శివశంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: తరుణ్ , స్నేహ, శివాజి, ప్రీతి విజయ్ కుమార్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 11.02.2001
మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
లలలా… లల లల లల లల లాలాలా…
లలలా… లల లల లల లల లాలాలా…
చింత నిప్పైన చల్లగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని
లేత గుండెల్లొ కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా ఎద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
నీలి కన్నుల్లొ అతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లొ ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా… ఆ…
లలలా… లల లల లల లల లాలాలా…
లలలా… లల లల లల లల లాలాలా…