Punadhirallu (1979)
Punadhirallu (1979)

Punadhirallu (1979)

చిత్రం: పునాదిరాళ్ళు (1979)
సంగీతం: ప్రేమ్జీ
సాహిత్యం: జాలాది (ఆశలే మసకేసిన రేయి), గూడపాటి రాజ్ కుమార్
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, జి. ఆనంద్, మాధవపెద్ది రమేష్, రమణ
నటీనటులు: చిరంజీవి , విజయ కృష్ణ, కె.డి.ప్రభాకర్, రామన్ గౌడ్, రాజేష్, సావిత్రి, రోజారమణి, కవిత, జయమాలిని
దర్శకత్వం: గూడపాటి రాజ్ కుమార్
నిర్మాత: యస్.ఫజులుల్లాహక్
విడుదల తేది: 21.06.1979

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

కార్మిక కర్షక శ్రామిక జీవులు
మనదేశానికి వెన్నుపూసలు
వారి రక్షణే దేశ రక్షణ
వారి పరీశ్రమె మన జీవనము
వారి పరీశ్రమె మన జీవనము

విజ్ఞానానికి ఉపాధ్యాయులు
ప్రజా సేవకై యన్ జి ఓ లు
ఐకమత్యతకు నాయకత్వము
వారి పరీశ్రమె దేశ పురోగతి
వారి పరీశ్రమె దేశ పురోగతి

స్వార్ధపరులకు సాయపడుటకై
సమ్మెలు సవాళ్లు చేయం చేయం
ప్రతిపని కోసం ప్రభుత్వమనక
ప్రజాశక్తిని కలుపుట న్యాయం
ప్రజాశక్తిని కలుపుట న్యాయం

సోమరితనముకు సమాధి కట్టి
అహకారంతో సాధన చేసి
ప్రాపంచాన్ని నిలబెడదాం
సమ సమాజాన్ని సాదిద్దాం
సమ సమాజమే సాదిద్దాం

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

మనం మనం ఒక పల్లె బిడ్డలం
అనం అనం నేను నాదని
పదం పదం కలుపుదాం
ప్రగతి పదంలో పయనిద్దాం
ప్రగతి పదంలో పయనిద్దాం

తరం తరం కలవాలని
నిరంతరం నిలవాలని
వేద్దాం పదండి వెలుగు బాటకు
కదలని చెదరని పునాది రాళ్ళు
కదలని చెదరని పునాది రాళ్ళు

భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాద్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం

వందేమాతరం (4)