Punnami Naagu (1980)

చిత్రం: పున్నమి నాగు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి, నరసింహారాజు, రతి అగ్నిహోత్రి
దర్శకత్వం: రాజశేఖర్
నిర్మాతలు: యమ్.కుమారన్, యమ్.శరవన్, యమ్.బలసుబ్రహ్మణియన్
విడుదల తేది: 13.06.1980

పల్లవి :
ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ.. పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..

పున్నమి రాత్రీ….పూవుల రాత్రీ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..పొంగిన వెన్నెల రాత్రీ..ఆ…

చరణం: 1
మగువ సోకులే.. మొగలి రేకులయి మత్తుగ పిలిచే రాత్రీ…
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి మైమరిపించే రాత్రీ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ.. ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..కలగా మిగిలే కడ రాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ…ఆ… పూవుల రాత్రీ..ఆ..ఆ…ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ….

చరణం: 2
కోడెనాగుకై  కొదమనాగిని..కన్నులు మూసే రాత్రీ….
కామ దీక్షలో కన్నెలందరూ..మోక్షం పొందే రాత్రీ..
నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..
నా కౌగిలిలో..ఓ..ఓ.. ఈ రాగిణీతో..ఓ..ఓ..
తొలకరి వలపుల తొలిరాత్రీ…..ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ… పూవుల రాత్రీ..ఆ..ఆ…ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ.. పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Bhalevadivi Basu (2001)
error: Content is protected !!