Punyavathi (1967)

చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (All)
గానం: పి.లీల
నటీనటులు: యన్. టి.రామారావు, శోభన్ బాబు, కృష్ణ కుమారి, యస్.వి.రంగారావు, భానుమతి
కథ: నిహార్ రాజన్ గుప్తా
మాటలు (డైలాగ్స్): డి.వి.నరసరాజు
దర్శకత్వం: వి.దాదా మిరాసీ
నిర్మాత: వాసు మీనన్
సినిమాటోగ్రఫీ: జగిర్ధార్
ఎడిటర్స్: కె.నారాయణన్ , కె.శంకుణ్ణి
బ్యానర్: వాసు స్టూడియోస్
విడుదల తేది: 03.11.1967

పల్లవి:
భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది
నా మనసు పరుగులు తీసింది
భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది
నా మనసు పరుగులు తీసింది

భలే బాగుంది అదే జరిగింది

చరణం: 1
పొంగిన లేత పరువానే
అందెను నేల గగనానే
పువ్వును పాడెను తీగెను ఆడెను
నాలో నాలో ఈనాడు

భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది
నా మనసు పరుగులు తీసింది

చరణం: 2
నీ కనునీడలొ ఉంటాను 
నా కలలే కనుగున్నాను
నీ కనునీడలొ ఉంటాను 
నా కలలే కనుగున్నాను
నీలో కలిసి నాలో విరిసి
నీలో కలిసి నాలో విరిసి
నీవే నేనై ఉన్నాను

భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది
నా మనసు పరుగులు తీసింది
హోయ్ భలే బాగుంది అదే జరిగింది

****** *******  *******

చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ… తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ….

మనసు పాడింది సన్నాయి పాట

చరణం: 1
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా… నా అలివేణి  తలవాల్చిరాగ

మనసు పాడింది సన్నాయి పాట…

చరణం: 2
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా … నా వనరాజు ననుచేర రాగా

మనసు పాడింది సన్నాయి పాట…

చరణం: 3
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ… ఆ..
పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా

మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ… తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ…ఆ ….

****** *******  *******

చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎంత సొగసుగా ఉన్నావూ …ఎలా ఒదిగిపోతున్నావూ
కాదనకా..ఔననకా..కౌగిలిలో దాగున్నావూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా…
 కాదనకా..అహా
 ఔననకా..ఆహా..
 కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ…

చరణం: 1
అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ..ఆ ఆ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ
అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
నీ తనువే.. తాకగనే.. నామది ఝుమ్మనెనూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా…
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..

ఎంతసొగసుగా ఉన్నావూ…

చరణం: 2
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ..ఆ ఆ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ..ఆ ఆ
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ
పులకించే..పెదవులపై..పలికెను పగడాలూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా…
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ…

error: Content is protected !!