చిత్రం: రాగదీపం (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల, రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కొడాలి బోసు బాబు
విడుదల తేది: 15.01.1982
పల్లవి:
తెల్లావారే తెల్లావారే
సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ
తెల్లావారే తెల్లావారే
సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ
నువ్వు లేవనంటే… మగత తీరదంటే..
సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ
సూరీడొచ్చి లేపుతాడు లేరా
తెల్లావారే తెల్లావారే
వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ
తెల్లావారే తెల్లావారే
వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ
నేను లేవనంటే… కాదు కూడదంటే
జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ
జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా
చరణం: 1
లోగిలంత ఇంటిలోనా… వాకిలంత చోటు చాలు
లోగిలంత ఇంటిలోనా..ఆ..వాకిలంత చోటు చాలు
లోతులంత చూడకుండా..ఆ..వాకిలేసి ఉంచుమేలూ
వాకిలేసినా… వేసి తీసినా… వలపు కళ్ళు మూతపడవూ
ప్రేమ వాకిళ్ళు… మూతపడవూ..
తెల్లావారే తెల్లావారే
వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ
తెల్లావారే తెల్లావారే
సూరీడొచ్చే వేళా ఆయె లేరా..ఆ
నేను లేవనంటే… కాదు కూడదంటే
సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ
జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ
చరణం: 2
పాలమబ్బు పాన్పులోనా… పట్టుకోక చాటు చాలు
పాలమబ్బు పాన్పులోనా… పట్టుకోక చాటు చాలు
పాలవెన్నగుండేలోనా..ఆ..పిడికిడంత చోటు చాలు
చోటు దొరికినా..పాట చాలినా… ఊరుకోవు చిలిపితలుపులూ
అవి పాడుతాయి నేల పలుకులూ
తెల్లావారే తెల్లావారే
వెన్నెలంత ఆవిరాయే వేళా..ఆ
తెల్లావారే తెల్లావారే
సూరీడొచ్చే వేళ ఆయె లేరా..ఆ
నేను లేవనంటే… కాదు కూడదంటే
సూరీడొచ్చి లేపుతాడు లేరా..ఆ ఆ
జాబిలొచ్చి లేపుతుంది లేమ్మా..ఆ
***** ****** ******
చిత్రం: రాగదీపం (1982)
సంగీతం: కె. చక్రవర్తి
సాహి: దాసరి
గానం: ఎస్.పి. బాలు
పల్లవి:
పసుపు తాడుకు ముడులు వేసి… బంధమంటే సరి పోదు
ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు…
సరిపోదు… సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి… బంధమంటే సరి పోదు
చరణం: 1
హృదయానికి హృదయం బంధం
మరో హృదయానికి తెలియని అనుబంధం
ఏ అడుగు వేయలేనిది… ఎదురేమీ అడగలేనిది
తాడు లేనిదీ… ముడులు లేనిదీ
తుడుచుకు పోనిది… తెంచుకు పోనిది
ప్రేమకు మాంగల్యం… ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
సరిపోదు.. సరి కాదు
చరణం: 2
అనురాగానికర్ధం త్యాగం… అదే అసలైన ప్రేమకు నిర్వచనం
మాటలకే అందనిది… మనసులకే అనుభవమైనదీ
భాష లేనిది… భావన వున్నది..
జన్మకు సరిపోనిది… జన్మలకే అంకితమైనదీ
ప్రేమకు మాంగల్యం… ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి… బంధమంటే సరిపోదు
ఏడూ అడుగులు నడిచినంతనే… భార్య అంటే సరి కాదు..
సరిపోదు.. సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి బంధమంటే సరి పోదు
***** ****** ******
చిత్రం: రాగదీపం (1982)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు
పల్లవి:
అదిగో అదిగో అదిగో… ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో… ఎవరో చూస్తున్నారు
వచ్చేసై… వచ్చేసై…
కాకులు దూరని కారడవుల్లో…
చీమలు చేరని చిట్టడవుల్లో..
ప్రేమించుకొందామా… పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో… ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో… ఎవరో చూస్తున్నారు
చరణం: 1
నీలి నీలి ఆకాశం తెల్లబోయినా
తెల్ల తెల్ల మబ్బులా ముఖం మారినా
గాలిజోరు నిను వెనకకు లాగినా
దుమ్ము ధూళి నీ కన్నులు మూసినా
ముందు చూడక… వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్…కమాన్ ఐసే కమాన్… వచ్చేసై
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా… పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో… ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో… ఎవరో చూస్తున్నారు
చరణం: 2
ఉరిమి ఉరిమి మెరుపుల్లో… పిడుగురాలినా
జడిసి జడిసి మేఘలే… నీరు కారినా
జోరువాన నిను ముద్దగ చేసినా
వరద పొంగు నిను ముంచి వేసినా
ముందు చూడక… వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్… ఐసే కమాన్… వచ్చేసై
అదిగో అదిగో అదిగో… ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో… ఎవరో చూస్తున్నారు
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా… పెళ్ళాడి ఉందామా
ప్రేమించుకొందామా… పెళ్ళాడి ఉందామా
***** ****** ******
చిత్రం: రాగదీపం (1982)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై…
నా కోసం విరిసిన కుసుమాలు
కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై…
నా సిగలో విరిసిన కుసుమాలు
చరణం: 1
ఎదలే..తుమ్మెదలై.. వినిపించే ఝంకారం
పెదవులు త్వరపడితే వలపుల శ్రీకారం
కనులే.. కౌగిలులై.. కలిసే సంసారం
పరువపు ఉరవడిలో.. మనసులు ముడిపడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు.. చెలికాయి జీవన దాహాలు
కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై…
నా సిగలో విరిసిన కుసుమాలు
చరణం: 2
కలలే..కలయికలై..చిగురించే శృంగారం
ప్రేమకు గుడి కడితే.. మన ఇల్లే ప్రాకారం
మనసే.. మందిరమై.. పలికే ఓంకారం
వలపుల తొలకరిలో.. తనువులు ఒకటౌతూ…
తొలిసారి పలికెను రాగాలు.. మనసార మధుర సరాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై…
నాకోసం విరిసిన కుసుమాలు