చిత్రం: రాఘవయ్యగారి అబ్బాయి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నల సీతారామశాస్త్రీ, వెన్నెలకంటి, శివశక్తిదత్తా, మీగడ రామలింగస్వామి
గానం: ఎస్.పి బాలు, చిత్ర, నవీన్, గంగ
నటీనటులు: శ్రీహరి, శ్రీహర్ష, ప్రేమ, పుండరీకాక్షయ్య
దర్శకత్వం: పేరాల
నిర్మాత: ఎ.పుండరీకాక్షయ్య
విడుదల తేది: 01.01.2000
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…
ఆ రామ నామం నువ్వనగనగా… నే వినవినగా…
వనమంతా పులకించి విరిజల్లులొలక
ఓ రామ శ్రీరామ జయరామ అంటూ పలుకే నా రామచిలుక
ఓ రామ శ్రీరామ జయరామ అంటూ పలుకే నా రామచిలుక
ఆ రామ నామం నువ్వనగనగా… నే వినవినగా…
వనమంతా పులకించి సిరిజల్లులొలక
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…
ఎద లోపల చెలరేగిన సుడిగాలుల
చిరు మబ్బుల తెరలన్నీ తొలగేనులే నేడు
అలనల్లన ఎల వెన్నెల సుధలొలుకుచు
వెలిగెనులే నా రామ చంద్రుడిదే చూడు
ఆ..ఆ..ఆహా.. ఆ..ఆ..ఆ…
చిలుకా చిలుకా చిన్నారి చిలుకా
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…
తళతళమని ధగధగమని వగలొలుకుచు
గగనంలో మిడిసిపడే ఒక తారక నేడు
చిరుగాలుల సిరిజోలల చిగురాకుల తూగాడుచు
చిరు నవ్వులు చిందునిది చూడు
ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఆ…
చిలుకా చిలుకా గారాలు చిలుక
ఓ రామ శ్రీరామ జయరామ అంటూ పలుకే నా రామచిలుక
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…
ఆ రామ నామం నువ్వనగనగా… నే వినవినగా…
వనమంతా పులకించి సిరిజల్లులొలక
ఓ! రామ శ్రీరామ నా రామ అంటూ… పలికే నా రామచిలుక…