చిత్రం: రైతు బిడ్డ (1971)
సంగీతం: ఎస్.హనుమంతరావు
సాహిత్యం: కొసరాజు
గానం: గంటసాల & కోరస్
నటీనటులు: యన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, అనురాధ, శాంతకుమారి, ఛాయాదేవి, సుజాత
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: కోట్ల వెంకట్రామయ్య
విడుదల తేది: 19.05.1971
దేవుడు సృష్హించాడు లోకాలు
ఈ మనిషే కల్పించాడు తేడాలు
పంచెగ్గట్టి మట్టిలో దిగితే
బీదా బిక్కి భావముండదు
వళ్ళు విరిచి చాకిరీకి వంగితే
గొప్పవాడినని అహం ఉండదు
రైతే మేడిపట్టకపోతే… ఓ ఓ ఓ
నవధాన్యం పండిచకపోతే
తినడానికి నీకెక్కడ వుందీ
ఇంకా నీ బ్రతుకేముంది
మూడంతస్తుల మేడల్లోనా
సంతోషం కనబడదయ్య
ఓడల్లాంటి కారుల్లోన
సంతుస్టన్నది కరువయ్యా
వెచ్చని పూరిగుడిసెల్లోన
పచ్చని పొలాల పైరుల్లోనా
శ్రమపడుతుంటే పిచ్చి రైతులా
చెమట బొట్టులో ఉందిరా సుఖం
ధనగర్వమ్మున నిక్కేవాడికి
శాంతియన్నదే ఉండదురా
రాజకీయముల మునిగేవాడికి
జీవితమల్లా అశాంతేరా
నాదని భూమిని నమ్మేవాడికి
నాగలి పట్టి దున్నేవాడికి
ఉన్నది ఎంతో సంతృప్తి
ఉందిరా సుఖ సంపత్తి