Raja (1999)

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
నటీనటులు: వెంకటేష్ , సౌందర్య
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 18.03.1999

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసిమొక్కలో నీ సిరులు  జ్ఞాపకం
చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలె మైమరపు జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు

ఏదో ఒక రాగం పిలిచిందీవేళ
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా

*********   *********   *********

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

*********  *********  ********

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర

ఆ… ఆ… లలలాలలా… లలలాలలా
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

గున్నమామి గొంతులో తేనెతీపి
నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార
వాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల
అందెలతో ఆడే సందడిది
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల
చీకటిని తరిమే బంధమిది
కల చెరగని కలలను చూడు
కంటికి కావాలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడు
ఇంటికి తోరణమనుకుంటా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

పంచుకున్న ఊసులూ పెంచుకున్న
ఆశలూ తుళ్లితుళ్లి ఆడుతున్నవి
కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై
నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసింది బ్రతుకే
చిగురు తొడిగేలా వరమై ఈవేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను
కలిసేలా ఎగసే ఈవేళ
అణువణువును తడిపిన ఈ తడి
అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటను
పరిచిన వనమును చూస్తున్నా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తోడుంటే చాలమ్మా లేనిది ఏముంది
ఆశ చిటికేస్తే చాలమ్మా అందనిదేముంది

*********  *********  ********

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగ పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం

*********  *********  ********

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో , చిత్ర

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చిన్న చిన్న సంగతులే సన్న జాజి విరిజల్లు
తుళ్ళుతున్న అల్లరులే ముల్లు లేని రోజాలు
అందమైన ఆశలే చిందులాడు ఊహలే
నందనాల పొదరిల్లు
గుప్పెడంత గుండెలొ గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ… వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు
వయసే తొలి చైత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కొమ్మ లేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే
పారిజాత హారాలు
అరె ముద్దు గుమ్మ ఎదలో మొగ్గ విచ్చు కధలే
ముద్ద మందారాలు
ఆ…. నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు
ఎపుడు వసివాడని వరమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతి నిమిషానా

*********  *********  ********

చిత్రం: రాజా (1999)
సంగీతం: యస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , సుజాత

పల్లవి:
కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా
చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా
తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా
ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమా
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్త వరదలా రామ్మా ప్రేమా
కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

చరణం: 1
అందమైన బంధనాల వరమా
బందనాల చందనాలు గొనుమా
కలే తీరుగా ఒడే చేరుమా
సున్నితాల కన్నె లేత నడుమా
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా
సాయం కావాలన్నదీ తాయం ఓ ప్రేమా
చేయందిస్తా రామరి సరదా పడదామా
నీవెంటే నీడై వుంటా నిత్యం ఓ ప్రేమా
కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా

చరణం: 2
వేడుకైన ఆడ ఈడు వనమా
వేడివేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా
అగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమాప తరమా
సుతారాలతో జతై చేరుమా
తీరం చేరుస్తున్నదీ నీ నవ్వేనమ్మా
భారం తీరుస్తున్నదీ నువ్వే లేవమ్మ
నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా
చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా
తియనైన ఓ ప్రేమా తేనెవానలా రమ్మా
ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమా
స్వతి చినుకులా సందెవెలుగులా
కోత్త వరదలా రామ్మా ప్రేమా
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్త వరదలా రామ్మా ప్రేమా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Surya son of Krishnan (2008)
error: Content is protected !!