Raja Rani Telugu Lyrics

Raja Rani (2014)

Raja Rani Telugu Lyrics

వినవే వినవె… లిరిక్స్

చిత్రం: రాజా రాణి (2014)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జి.వి.ప్రకాష్ కుమార్, శక్తిశ్రీ గోపాలన్
నటీనటులు: ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం
దర్శకత్వం: అట్లీ
నిర్మాణం: ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం
విడుదల తేది: 14.03.2014

వినవే వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా..
ఇసుకనిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా..
ఆణువణువూ నీ వలపే…
క్షణక్షణము నీ తలపే…
ఆణువణువూ నీ వలపే…
క్షణక్షణము నీ తలపే…

వినవే వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
ముసురువేసి ఎండ రాకపోతే నింగినేరమా..
నదులలోన నీరు ఆవిరైతే నేలనేరమా..
ఆణువణువూ ని వలపే…
క్షణక్షణము నీ తలపే…
ఆణువణువూ నీ వలపే…
క్షణక్షణము నీ తలపే…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

చల్లగా ఒక చినుకులా… లిరిక్స్

చిత్రం: రాజా రాణి (2014)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రాహుల్ నంబియార్, మేఘా, మిల్టన్
నటీనటులు: ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం
దర్శకత్వం: అట్లీ
నిర్మాణం: ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం
విడుదల తేది: 14.03.2014

చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగేనే హల్లా
నీ కనుపాపై నే చేరినా పిల్లా
నీ కలలాగ నే మారినా పిల్లా
ఓ ఓ ఓ ఓ ఓ

ఓసి మడత కాజ నా మామిడి తండ్రా నవ్వి సంపొద్దే
నా మోట బావిలో నీ నాటు వోడని అట్టా నడపొద్దే
కళ్ళేవి పడకుండా కళ్యాణం చేద్దామా
కల కాలం ఉందామా…

కొంచెం చూడు మరి కొంచెం నవ్వు మరి
అంటూ నా కనులు హయ్యయ్యో నను తిట్టే
మండు వేసవిలో పండు వెన్నెలలు
చల్లుతుంది మది ఏదేదో పిచ్చి పట్టి
గాలివాన వలనే తోసినావు నాదు ఎదనే
నీ వల్లే అయ్యానే దారాన్నే
తెంపేసిన గాలి పటం
అమ్మాయి అమ్మాయి
నే పడితే చేరాలి నీ పాదం
నీ కనుపాపై హో..నే చేరినా పిల్లా
నీ కలలాగ హా..నే మారినా పిల్లా
చల్లగా ఒక చినుకులా నను తడిమినే పిల్లా
చిలిపిగా నా మనసిలా రెక్క తోడిగెనే హల్లా

సుందరి కిన్నరి మణి కొలుసా
తరి వళకిరు కిలుక్కిరుక్కా
తరి మిన్నారం చెరు పొన్నారం
ఇదు మధుర మధుర కరింబో..కళ వేణీ మృదు పాణీ
నిన్ హృదయ వనియలన్ గానం
స్వరమాయే జతిఆయే
ఇన్ నుణరి మరియ నాన్ మొహం
ప్రేమ తాకి జ్వరమేదో సోకి మరి ఆవిరైతి
నువు ముద్దిచ్చి తగ్గించు
కోపగించు కొను వేళలోన కనుపాప దొరకుండు
కోపాన్నే రప్పించు

ఉసురు తీయు సొగసా నీ నీడకింత చలవా
బతుకంతా బ్రతిమాల్నా విడిపోని మత్తేదో చల్లావే
నదులైనా కడలైనా ఆపలేనీ నిప్పల్లె చేరావే
నీ కనుపాపై హో నే చేరినా పిల్లా
నీ కలలాగా హా నే మారినా పిల్లో
హే హే ఓ ఓ ఓ ఓ

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఒడె ఒడె ఒడె… లిరిక్స్

చిత్రం: రాజా రాణి (2014)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్, రణినా రెడ్డి, సల్మాలి ఖోల్గడే, సాషా
నటీనటులు: ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం
దర్శకత్వం: అట్లీ
నిర్మాణం: ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం
విడుదల తేది: 14.03.2014

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే..
చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా..
దిక్కులన్నీ అదిరే, చుక్కలన్నీ చెదిరే..
లేనే లేదు కుదురే, లవ్ అంటే కష్టమా..
మిస్టర్ ప్రేమ అంటూ, నన్నే ఊరిలోన అంటారే..
మిస్సుడ్ కాల్ గా, మార్చమాకే..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

భయం లేనోడినైనా, చెయ్యాల్సొచ్చే ఫాలోయింగ్
కాళ్ళా వేళ్ళా పడితే, మనసే కరిగి లవ్ గ్రోయింగ్
పక్కా పక్కనె ఉండి, పదివేల లుక్సు బారోయింగ్
పక్కా శోధనవల్లే, అప్పుడు ఇప్పుడు ఔట్ గోయింగ్
ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె
ఐకాన్ వా సైతాన్ వా, నువ్వేమో స్వీటా లేదా హాటా..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

నామది నీదని రాశావా, రాసేశా..

నీవే జ్ఞాపకమొస్తే, న్యూరాన్స్ అన్ని మెరిసాయి
నీవే కల్లోకొస్తే, హార్మోన్స్ అన్నీ మురిసాయి
సాంగై వినిపిస్తాయి, సంగతులన్నీ నీవల్లే..
వ్రాంగ్ గా స్నేహం చేస్తే. లంగ్స్ లో లవ్వే శ్వాసయ్యే..
ఒహో ఓహో ఎహె ఎహె ఒహొ ఒహొ ఎహె ఎహె
తిట్టైనా తిక్కైనా. తియ్యంగా తీసుకుంటుంది జన్మ

ప్రేమంటే నా బ్రదరే.. నీపై పిచ్చి ముదిరే..
చెప్పెయ్ మంది వెదరే.. నేనంటే ఇష్టమా..
దిక్కులన్నీ అదిరే, చుక్కలన్నీ చెదిరే..
లేనే లేదు కుదురే, లవ్ అంటే కష్టమా..
మిస్టర్ ప్రేమ అంటూ, నన్నే ఊరిలోన అంటారే..
మిస్సుడ్ కాల్ గా, మార్చమాకే..

ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..
ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Lava Kusa (1963)
error: Content is protected !!