చిత్రం: రాజా సింహం (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: Ch. V. అప్పారావు
విడుదల తేది: 1995
ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి
కిందపడి మీదపడి ఈడుకి నేర్పవ కొత్త జతి
బంగారు బాలా ఈ కంగారు ఏలా…
శృంగార నీలా జరిపించాలి వేళా
మోహంతో కలబడు పెదవుల కలహములో
ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి
ఇందుమతి చారుమతి
పాలబుగ్గ మీద పంటి గాటు
కొంటె ఓనమాలు రాయగా
పైట సిగ్గుమీద కంటి గీటు
కైపు సంతకాలు చేయగా
చెయ్ చెయ్ అందం జతే పడి జరిగే జాతర్లకి
శ్రమపడితే రహస్యమేమిటో తెలియక పోదులే
చమట పడితే వయస్సు భారమే కరగక పోదులే
బరిలో దిగుదాం సూటిగా యమ ధాటిగా పని తీరిపోదా
ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి
ఇందుమతి చారుమతి
దాచిపెట్టుకున్న తాయిలాలు
వేయి వందనాలు చేయగా
చూడ ముచ్చటైన సోయగాలు
హాయి తంధనాలు వేయగా
తాళం పడని తలాంగని తూలే క్షణాలలో
తహ తహతో సుఖాల సంపద వెతికిన మోజులో
పసి ఎదలో నిషాల పూపొద విరిసిన పూజలో
సూద్దాం పద నిషి రాత్రిలో రతి యాత్రలో రస నాట్యదాన్ని
ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి
కిందపడి మీదపడి ఈడుకి నేర్పవ కొత్త జతి
బంగారు బాలా ఈ కంగారు ఏలా…
శృంగార నీలా జరిపించాలి వేళా
మోహంతో కలబడు పెదవుల కలహములో
******** ******* ********
చిత్రం: రాజా సింహం (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర
ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని
చీరకు చాలని చింతామణి
ఓ వద్దు వద్దు వద్దు వాత్సాయన
నన్నిక చంపకు నారాయణ
జల్సాలకే జన్మోత్సవం
తెల్లారితే సిగ్గోత్సవం
మనిసిజ సరసిజ మలయిజ గిజ గిజలో
ఓ ఓ ఓ… – ఓ ఓ ఓ…
ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని
చీరకు చాలని చింతామణి
వద్దు వద్దు వద్దు వాత్సాయనా
నన్నిక చంపకు నారాయణ
ఝాడించే జాణందమే సల సల వనికితే చెయ్యాగునా
ఓ ఒళ్ళోంచి వయ్యారమే ఒరిపిడి అడిగెను వాటేయవా
ముంజలోలుకు మూతి చురక ముద్దు మరక
ముక్కుపుడక మోతలే భామ
ఇల్లు వణికి పంట గనక మల్లెకరిగి మచ్చ మరక మోజుగా మామ
బుగ్గల్లత్త ముద్దింటమ్మ సేవలో
గాజులంత గల్లంతమ్మ పూజలో
మెళ్ళోముద్దు జల్లోకొస్తే పూవ్వుగా
ఒళ్లోకొచ్చి వాలాలొచ్చి తుమ్మెద
కువ్వక్కు అందాలు తిమ్మెక్కిపోతే సఫా…
ఓ ఓ ఓ… – ఓ ఓ ఓ…
ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని
చీరకు చాలని చింతామణి
వద్దు వద్దు వద్దు వాత్సాయనా
నన్నిక చంపకు నారాయణ
శోదిందే నీ చూపులే కుదిపెను పొదుపుల రైకమ్మని
ఓ అందంలో ఆరాటమే పిలవక పిలిచెను రారమ్మని
పిచ్చి ముదిరి పిల్లకుదిరి పిందెలదిరి
పిట్ట చెదిరి పోయెరా మామ
చెయ్యి కలిపి చెంగు దులిపి చంప నలిపి
చక్కర లిపి రాయెనే భామ
సిగ్గమ్మత్త సిగ్గింటమ్మ హారతి
మొగ్గంటించి నీకే ఇస్తా మోజులో
కొంగొత్తంగ కోక జారే సంగతి
అద్దంలాగా చిపిస్తావా నీడలో
నీ మాట విన్నాక మొమాట మేలాగా మహా…
ఓ ఓ ఓ… – ఓ ఓ ఓ…
ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని
చీరకు చాలని చింతామణి
వద్దు వద్దు వద్దు వాత్సాయనా
నన్నిక చంపకు నారాయణ
జల్సాలకే జన్మోత్సవం
తెల్లారితే సిగ్గోత్సవం
మనిసిదే సరసిగ మలయిక గిజ గిజలో
ఓ ఓ ఓ… – ఓ ఓ ఓ…
******** ******* ********
చిత్రం: రాజా సింహం (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా
దస్కతకి బుగ్గ రెడీ చెయ్యాలిగా
చేస్తా వత్తిడి ముద్దుల్తో ముట్టడి
రమ్యా రాబడి చలో గిలో హలో చలో
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలకా
కస్కుమని కౌగిలికే రావాలికా
లేటే చేయక లేటెస్ట్ ప్రేమిక
చాటే లేదిక లగో లగో వగో పగో
వస పిట్ట పలికింది కసి చెట్టుమీన
నడి కట్టు చెదిరింది ముడి పెట్టు మామ
రస పట్టు తెలిసింది గిలిగింతల్లోనా
చెలి పెట్టు కలిపింది చలిగంగల్లోనా
లెఫ్ట్ రైట్ లవ్వే అబ్బాయి ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వు నేనోయి
సూటు సైట్ రెండే అమ్మాయి
చాటు మాటు లేవే గుమ్మాయి
ఆత్రేయన్నది రౌద్రే విన్నది కోసరాజు కుంటున్నది
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా
కస్కుమని కౌగిలికే రావాలికా
ఫిగరుంది పొగరుంది చిగురుంది చానా
పిడుగల్లే కొడతాను బిడియాల సేనా
కథలెన్నో చదివాను కను చూపుల్లోనా
మనసంటే నసపెట్టే వయసింతే మైనా
మబ్బు మబ్బు తళుక్కంటుంటే
ఈడు జోడు కలుక్కంటాయి
ఊరు వాడ వెతుక్కుంటుంటే
నీలో నేను ఇరుక్కుంటాలే
ఆరుద్ర అన్నది ఏ నిద్ర రానిది
పింగళికే పిలుపైనది
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా
దస్కతకి బుగ్గ రెడీ చెయ్యాలిగా
చేస్తా వత్తిడి ముద్దుల్తో ముట్టడి
చాటే లేదిక లగో లగో వగో పగో
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా
******** ******* ********
చిత్రం: రాజా సింహం (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, చిత్ర
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట
సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట
ఆడే బావయ్యా ఓ లవ్వాట
అడిస్తానమ్మో… జివ్వు జివ్వాట
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట
సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట
తెల్లచీర మల్లెపూలు తెచ్చినోడే మంచిమొగుడు
తెల్లచీర మల్లెపూలు తెల్లవార్లూ పంచిచూడు
చూపించు నీ వల్ల శృంగారం
సయ్యంటే ప్రతి రేయి జాగారం
చల్ల కంబళ్ళు గిలి తీరే కౌగిళ్ళు
కొసరే చెక్కిళ్ళు కసి రేపే ఎక్కిళ్ళు
కమ్మగా సమ్మగా తిమ్మిరే తీరగా
అడిస్తానమ్మో… జివ్వు జివ్వాట
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట
సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట
మచ్చ ఉన్న అందగాడే నన్ను దోచే చిన్నవాడే
మచ్చలేని చందురూడే నిన్ను కోరి వచ్చినాడే
యుద్ధంలో నీ గాయం చూపించు
ముద్దుల్లో నీ సాయం అందించు
ఏది నీ మచ్చ ఒకసారి చూడొచ్చా
మచ్చే ఉందంటే సంసారం చేయ్యొచ్చా
బావయ్యో రావయ్యో మరదలే నీదయ్యో
అడిస్తానమ్మో… జివ్వు జివ్వాట
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట
సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట
ఆడే బావయ్యా ఓ లవ్వాట
అడిస్తానమ్మో… జివ్వు జివ్వాట
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట
సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట