చిత్రం: రాజాబాబు (2006)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. ఎస్.మూర్తి
గానం: మధు బాలక్రిష్ణన్
నటీనటులు: రాజశేఖర్, కృష్ణ ఘట్టమనేని, శ్రీదేవిక (నూతన పరిచయం)
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: పరుచూరి శివరామ ప్రసాద్
విడుదల తేది: 24.02.2006
నువ్వే మా రాజువని మనసే నీ కోవెలనీ
ఎంతో ప్రేమించిన ఈ లోకం
నిన్నే వెలివేసెను ఈ నిమిషం
ఊరందరి కన్నీళ్లు తుడిచింది నువ్వైనా
నీ కన్నుల నీలాలు కన్నారా ఎవరైనా
ఇన్నాళ్లు కన్నవి కలలేనా
నీ త్యాగం నవ్వుల పాలేనా
కనిపెంచి కంటిపాపలా చూసుకున్న ఆ దేవత
మరిసిందా మురిసి మున్ను లాలించే ఆ వేడుక
నువ్వే తన ప్రాణమంది ఇల్లాలు ఎద సాక్షిగా
నిన్నే ద్వేషించి చూసింది కంటిలో నలుసుగా
కన్న తండ్రి కోసం నిజం దాచినా
నమ్మలేని లోకం నిన్ను మెచ్చునా
ఇంకా ఎన్నాళ్ళో ఈ శాపం
మళ్ళీ వస్తుందా మధుమాసం
నువ్వే మా రాజువని మనసే నీ కోవెలనీ
ఎంతో ప్రేమించిన ఈ లోకం
నిన్నే వెలివేసెను ఈ నిమిషం
పదిమంది మనసులోన పూజించుకున్న దైవానివి
నీ ఇంటె తావులేక తలవంచుకున్న అపరాదివి
నలుగురికి దారిచూపు రహదారిలోన దీపానివి
నీడైన తోడురాని పయనాన నేడు ఏకాకివి
ఇలా ఆశలన్నీ బలైపోయినా
తుదే లేని శోకం జాలి చూపునా
ఏదీ నిను పిలిచే ఒక హృదయం
కథగా మిగిలిందా అనుబంధం
నువ్వే మా రాజువని మనసే నీ కోవెలనీ
ఎంతో ప్రేమించిన ఈ లోకం
నిన్నే వెలివేసెను ఈ నిమిషం
ఊరందరి కన్నీళ్లు తుడిచింది నువ్వైనా
నీ కన్నుల నీలాలు కన్నారా ఎవరైనా
ఇన్నాళ్లు కన్నవి కలలేనా
నీ త్యాగం నవ్వుల పాలేనా