Rajadhi Raja (2016)

చిత్రం: రాజాధి రాజా (2016)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ , సిద్దార్ధ్ విపిన్ (BGM and Two Songs)
సాహిత్యం: రాఘవేంద్ర మౌళి (రాకేందు మౌళి)
గానం: రాహుల్ నంబియర్, మాయ, జి.వి.ప్రకాష్ కుమార్
నటీనటులు: శర్వానంద్, నిత్యామీనన్
దర్శకత్వం: చేరన్
నిర్మాత: ఎన్.వెంకటేష్
విడుదల తేది: 24.06.2016

(బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు  సంద్రానిది మేఘం,  ఏదేదో మారాయి  రెండు పాటలు  కూడా సిద్దార్ధ్ విపిన్ కంపోజ్ చేశారు)

మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా
కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా
మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా
కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా
దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా
చేరుకున్నా తీరమైనా నీకు సొంతం అవుతుందా
గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా
నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ

తామరాకుపై నీటి బొట్టులా ఉంది గుండెపై ప్రేమ సంతకం
ఆవిరవ్వనీ నీటి రాతలా లోపలున్నదీ తీపి జ్ఞాపకం
చీకటైతె ఆ వెన్నెల్లో వేకువైతే ఆ వెలుగుల్లో
హాయి చూడమంటుంది ఈ లోకం
చేరువైతే ఈ చూపుల్లో దూరమైతే ఆ గురుతుల్లో
దాగి ఉంటది ఆనందం మనసా…
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ

ఎత్తు పల్లం లేని బాటని చూపలేవుగా నువ్వు నేలకి
ఆటు పోటులు లేని జన్మని చూడలేముగా ఎన్ని నాళ్ళకీ
ఎంత చిన్నదో ఆకాశం ఆశ ముందర ఈ నిమిషం
వెతకమన్నది నీ సంతోషం కోసం
అంతులేని ఈ ఆరాటం ఆపమన్నది ఈ హృదయం
పంపుతున్నది ఆహ్వానం మనసా
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ
ఏమిటోలే ఈ మాయ అసలేమిటోలే ఈ మాయ

మనసా మనసా సమయాల మాయ చూస్తున్నావా
కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా
మనసా మనసా సమాయాల మాయ చూస్తున్నావా
కనులే తెరచి కాలాన్ని స్వాగతిస్తున్నావా
దారులెన్నో ముందరున్నా తీరమైతే ఒకటేగా
చేరుకున్నా తీరమైనా నీకు సొంతం అవుతుందా
గాలులెన్నో తాకుతున్నా ఊపిరయ్యేదొకటేగా
నువ్వు పీల్చే ఊపిరైనా నీకు తోడై ఉంటుందా

******   *******   ********

చిత్రం: ఏమిటో ఈ మాయ (2016)
సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్,
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: జి. వి.ప్రకాష్ కుమార్, పూజా

నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది
మనమేమి చెప్పినా మౌనం వింటుంది
మౌనాన్ని మించు భాష లేదుగా
మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే

నువ్వేమి చెప్పినా నా మధి వింటుంది
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది

నువ్వెల్లే దారుల్లో ఒక మొక్కై ఉందీజన్మ
ఎండైన వానైన అది నీకై వేచిందమ్మా
నది అయినా కడలైన అరె నింపేది వానేగా
నీ మేఘం నా మేఘం అని వేరంటే వెర్రెగా
జన్మంతా వేచుంటా నువు జత పడుతుంటే
క్షణముల్లో కనుమూస్తా కలవను పొమ్మంటే

మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే

మౌనం ఓ కడలైతే నీ చిరునవ్వేగా కెరటం
ఉప్పెన పొంగిందంటే నువు మాటలు పైకి అనటం
మౌనం ఓ మబ్బైతే నీ శ్వాసైందే ఈ గాలి
గాలులకే మాటోస్తే మన పలుకుల ఈ వర్షాలే
జల్లుల్లో తడవాలా కిటికీ తెరవాలే
వానతో మాటాడాలా గొడుగుని వదలాలే

మౌనమమే బాషకిలా చిరునవ్వే కవితవునే
నువ్వేమి చెప్పినా నా మధి వింటుందే
నేనేమి చెప్పినా నీ మధి వింటుంది
మనమేమి చెప్పినా మౌనం వింటుంది
మౌనాన్ని మించు భాష లేదుగా

error: Content is protected !!