చిత్రం: రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , సౌందర్య
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె. అచ్చిరెడ్డి
విడుదల తేది: 22.01.1993
కుకూ కుకూ కుకూ… ఎవరో నీవని అనకు
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్తా పట్టి చూడు
తొలి తొలి వలపుల తలపులు
మై మరపులో
కుకూ కుకూ కుకూ… నీవే నేనని తెలుసు
కళ్ళతోని గుండె తట్టి చూశా
ప్రేమనాడి జాడ పట్టి చూశా
తొలి తొలి పరువపు పిలుపులు
మై మరపులో
కుకూ కుకూ కుకూ…
కుకూ కుకూ కుకూ…
చరణం: 1
మనసున మెల్లగా ఉయ్యాలలూగిన
విరహాపు మెరుపులు కన్నవా
తనువును తాకిన అల్లరి గాలులా
కమ్మని ఉస గుస విన్నవా
కొంగుపట్టి లాగి కొత్త కొత్తగా
అబ్బాయినన్ను చుట్టకుంటే
ఎంత మైకమో
అత్తి పత్తిలాగా మెత్త మెత్తగా
అమ్మాయి సిగ్గు దాచుకుంటే ఎంత అందమో
కుకూ కుకూ కుకూ…
కుకూ కుకూ కుకూ…
చరణం: 2
నింగికి నెలకి బాటలు వేసిన
తొలకరి చినుకుల ఆరాటం
విరిసిన పువ్వుల పంచకు చేరిన
గడసరి తుమ్మెద కోలాటం
చిన్నదాని పాలబుగ్గ వంపులో
కీలాడి ముద్దు పెట్టుకుంటే ఎన్ని సొంపులు
హత్తుకున్నమేని వత్తిగింపులో
అల్లడుతున్నా పిల్లవాడికి ఎన్ని చిక్కులో
కుకూ కుకూ కుకూ… ఎవరో నీవని అనకు
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్తా పట్టి చూడు
తొలి తొలి వలపుల తలపులు
మై మరపులో
కుకూ కుకూ కుకూ…
కుకూ కుకూ కుకూ…
******** ******** ********
చిత్రం: రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నీలి వెన్నెల జాబిలి
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
రామరి నాదారి అందుకో ప్రేమని
నీలికన్నుల కోమలి
నీలి వెన్నెల జాబిలి
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
చేరని నీదారి పొందని ప్రేమని
రాగా వీదుల సాగాని
చరణం:1
నా వలపుల కోవెల మంటపం
నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్ సోయాగం
తొలిప్రేమకు ఆయాను తోరణం
ప్రేమలే పెన వేయగా
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు సరసాల సుధలు
మనసారా మరులు పండించుకుందామ
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
చరణం: 2
ఓ చల్లని చూపుల దేవత
ప్రతి జన్మకు కోరేదా నీజత
నా కుంకుమ రేఖల బంధమా
జత చేరుమ జీవన రాగమా
కాలమా అనుకులము
కానుకా సుముహుర్తము
గోరింటా పూల పొదరింటిలోనా
నీ కంటి దీపమై జంట చేరానా
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
చేరని నీదారి పొందని ప్రేమని
రాగా వీదుల సాగాని
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
రామరి నాదారి అందుకో ప్రేమని
నీలికన్నుల కోమలి