Raju Maharaju (2009)

చిత్రం: రాజు మహారాజు (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: చక్రి, సుధ
నటీనటులు: మోహన్ బాబు, రమ్యకృష్ణ, శార్వానంద్, సుర్వీన్ చావ్లా
దర్శకత్వం: దుర్గా శంకరనాథ్
నిర్మాత: కుమారస్వామి పత్తికొండ
విడుదల తేది: 2009

కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
చలియా నీ కన్నులలోన నా రూపం గమనిస్తున్నా
ఆనందం అంచున నేనున్నా…
ఏం చేసావే అందాల మైనా ఏదో కొత్త లోకన ఉన్నా
మతిపోతోంది నీ వింత మాయేదైనా…
గుర్తేలేదు ఆ నిన్న మొన్న ఎటుపోయింది ఏకాంత మైనా
మనసేతేలిపోతోంది మబ్బుల పైన…
ఆనందం అంచున నేనున్నా…

కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా…

తొలిసారి నా మదిని ఈ రోజే నవ్వించా
వేసారే నెమ్మదిని వెన్నెలపై నడిపించా
ఇన్నాళ్లు బతికే ఉన్నా ఇపుడేగా జీవిస్తున్నా
నా సంతోషం ఏదైనా నువ్వేగా
అచ్చం నీ లాగే ఏదో ఉన్నాగా
ప్రేమించే హృదయంలోని తెల్లదనానికి స్వాగతమిస్తున్నా

ఆనందం అంచున నేనున్నా… ఆకాశం నేనైపోతున్నా…
కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా

వర్షించే మేఘంలా ఉరిమావే ఇన్నాళ్లు
కరుణించే దేవతలా కురిశావే పన్నీరు
అవునంటూ వరమిచ్చావే నా ప్రేమకు బలమిచ్చావే
శూన్యాన్నే వెలిగించావే దీపంలా…
మౌనం కరిగేలా మాటే దిగుతున్నా
ప్రాణాన్నే వెంటాడే నీ బంధానికి నే సొంతం అవుతున్నా

ఆనందం అంచున నేనున్నా… ఆకాశం నేనైపోతున్నా…
కలలోనే కలగంటున్నా నిజమేదో కనుగొంటున్నా
ఆనందం అంచున నేనున్నా…

********  ********  ********

చిత్రం: రాజు మహారాజు (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: షాన్, సుధ

error: Content is protected !!