Rakshakudu (1997)

చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర (All Songs)
గానం: హరిహరన్, సుజాత
నటీనటులు: నాగార్జున, సుష్మిత షేన్
దర్శకత్వం: ప్రవీణ్ గాంధీ
నిర్మాత: కె.టి.కుంజమాన్
విడుదల తేది: 30.10.1997

పల్లవి :
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా…
చెక్కిలిని దోచినది నేనేగా… అరె నేనేగా…
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా…
చెక్కిలిని దోచినది నేనేగా  అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

 చందురుని తాకినదినీవేగా  అరె నీవేగా
 వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా
 వయసు వాకిలిని తెరిచె వయ్యారం
 నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం

చరణం: 1
పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే
పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే
పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే
తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా
కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా

చందురునీ…
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా…
చెక్కిలిని దోచినది నేనేగా  అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

చరణం: 2
రమ్మనే పిలుపువిని రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదమంటూ జల్లుతోంది చందనమే
నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా
చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
ఓ అలిగిన మగతనమే పగబడితే వీడదే

చందురునీ…
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
అరె ఆర్మ్ స్ట్రాంగా…
చెక్కిలిని దోచినది నేనేగా  అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

*********  **********  **********

చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి

సోనియా… సోనియా…
సోనియా సోనియా
సోనియా… సోనియా

పల్లవి:
సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటో
పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటో
పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

చరణం: 1
పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించేయాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటే ఉందే
మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రెండిట్లో ఏది నాకు ప్యారు

చరణం: 2
ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపే కళ్లల్లో
మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే
అంపైరు లేదే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటో
పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

సోనియా… సోనియా… సోనియా…

*********  **********  **********

చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: సాధనా సర్గమ్ , కె.జె.యేసుదాసు

నిన్నే నిన్నే వలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కన్నుల కరిగిన యవ్వనమా
ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కధలే వేరమ్మా

నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది

చరణం: 1
పువ్వా పువ్వా నీ ఒడిలో ఒదిగిన క్షణం ఎక్కడే
కలిగిన సుఖం ఎక్కడే
అభిమానంతో తలవంచినా ప్రేమకి చోటెక్కడే
నిలిచితి నేనిక్కడే
కళ్ళల్లోని ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే
వలచినవారే వలదంటే మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను
నిజమే తెలిసి మూగబోయి ఉన్నాను

నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధ తీర్చులే
నిన్నే నిన్నే… నిన్నే నిన్నే… నిన్నే నిన్నే

చరణం: 2
ప్రేమా ప్రేమా నా మనసే చెదిరిన మధువనమే
వాడెను జీవితమే
విరహమనే విధి వలలో చిక్కిన పావురమే
మరచితి యవ్వనమే
కలలొనైనా నిన్ను కలుస్తా ఆగనులే ప్రియతమా
లోకాలన్ని అడ్డుపడినా వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా
భాధేతొలిగే క్షణమగుపడదా

నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధా తీర్చులే
నిన్నే నిన్నే… నిన్నే నిన్నే… నిన్నే నిన్నే

Previous
Majnu (1987)
error: Content is protected !!