Rakshana (1993)

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున, శోభన, రోజా
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 18.02.1993

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

అమ్మో అంతటా వింతటా… ఒక్కటే చిచ్చటా
పాపం.. లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

చరణం: 1
చెలి తాకిన సుఖానికీ ఇలా రేగి పోవాలా
కొయ్యబారిన క్షణనికే కులాశాలు కావాలా
నిలువునా… పిలవనా
వదలదీ ఖర్మం తలబడే కథా
కసరకే పాపం పసితనం కదా
ఐతే మహత్తు కలిగిన ముహూర్త బలమున
రహస్యమడిగితె వలదని అననట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా
అమ్మో అంతటా వింతటా ఒక్కటే చిచ్చటా
పాపం లేత వయసకు లోతు తెలియని
కోత తగిలిన తహ తహ తెగులట

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

చరణం: 2
ఆడగాలికి అటూ ఇటూ చెడిందేమి ఆరోగ్యం
కన్నెతీగల కరెంటులో పడిందేమొ వైరాగ్యం
నర నరం… కలవరం…
కనకనే కంట్లో…  కునుకు ఉండదే
కౌగిలే ఉంటే కలత ఉండదే
ఇంకేం తథాస్తు అనుకొని తపస్సు వదలన
గృహస్తునవగల కులుకుల జతపడి

గుప్పు గుప్పు గుప్పుమన్నదంట ఏంటటా ఏంటటా
ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చటా ముచ్చటా

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
Hands up
You are under arrest
Don’t move
I want to dance with you

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

చరణం: 1
నా కదం రిధం జతే పడే దూకుల్లో
ఓ…మేడం సలాం వశం అనే కుర్రాల్లూ
సిగ్గులు విడిచీ పెట్టుకు వస్తే లగ్గం
సాధనలోనే చూపెడతాలే ఓ స్వర్గం
దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం
చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

చరణం: 2
చూపకూ నిగ్గూ నీ దమ్ములోన వేడీ
ఆపకూ అలా కులాశ కూచిపూడీ
లాఫరు ఫోజుల కథకెళి చెయ్యకు బద్రం
చూపుల భరతం పట్టేస్తుందీ చ్హూ మంత్రం
ఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం
పాపము చేస్తా ఆవిరి ముక్కుల ఆరంగేట్రం

కన్నెపాపా అందుకో నా చిందులో ఊపందుకో
నీ కొత్తగా చూడాలనా ఈ బీటులోడౌటు ఎందుకో

ధూం తకతక తకోం ధూం తకతక తకోం దుమ్ము రేపే
ధూం తకతక తకోం ధూం తకతక తకోం దమ్ములుంటే కాసేస్కో

చిత్రం: రక్షణ (1993)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యమ్. యమ్.కీరవాణి, చిత్ర

పల్లవి:
ఆహహా లాలలా
లల లల లల లల లలలా
ఆహహా లాలలా
లల లల లల లల లా హా

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ

మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం…  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం: 1
ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం

పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించె ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో ఓ బాటసారినో
ఏ జన్మదో ఈ సంబంధమూ

చరణం: 2
లతలు రెండూ విరులు ఆరై విరిసె బృందావనీ
కలలు పండీ వెలుగులాయే కలిసి ఉందామనీ

వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికీ కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోటమాలిదో

ఏ జన్మదో ఈ సంబంధమూ
ఏ రాగమో ఈ సంగీతమూ
మనసే కోరే మాంగల్యం
తనువే పండే తాంబూలం…  ఈ ప్రేమ యాత్రలో
ఏ జన్మదో ఈ సంబంధమూ