చిత్రం: రక్త సింధూరం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: ఏ.శేషారత్నం
విడుదల తేది: 24.08.1985
పల్లవి :
ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా.. ఓ భామా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా
నా కంటిపాపా నీ జంటతోనే ఓ ఇంటివాణ్ణి చేసేయ్యవా
ఏకాంత వేళ ఈ కాంత సేవా వరమియ్యవా
ఓ చిన్నవాడా చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
నా అందమంతా నీ హారతేలే లాలించరా
చరణం: 1
జలకాలాడించనా.. జడలే అల్లించనా
జాజీపూలెట్టి పూజించనా
కసిగా కవ్వించనా… రుచిగా నవ్వించనా
నడుమే అందించి లాలించనా
ఇల్లే కట్టేస్తే.. కౌగిళ్లిచ్చేస్తా
ముగ్గే పెట్టెస్తే ముగిళ్లిచేస్తా
సామిరంగ సందెముద్దు పెట్టనీదాయే
నింగిలోని రంగు పొద్దు జారనీడాయే
ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా.. ఓ భామా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ
చరణం: 2
మనసై జపించనా… వయసై తపించనా
మల్లేదీపాలు వెలిగించనా
సొగసై వరించనా.. సగమై తరించనా
మసకా మంత్రాలు వల్లించనా
ముసిరే సిగ్గుల్తో ముద్దే ఇచ్చేస్తా
ఇచ్చే ముద్దుల్తో నచ్చేదిమ్మంటా
అబ్బరంగా ఒక్కటిచ్చి పండుకోడాయే
నిబ్బరంగా నిప్పు ఈడు ఉండనీదాయే
ఓ చిన్నవాడా చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
ఏకాంత వేళ ఈ కాంత సేవా వరమియ్యవా
ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉహు..హు..ఉహు..
అహాహా… ఓ..హో..హో…
******* ******* *******
చిత్రం: రక్త సింధూరం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
అది సరిగమ పాడిన స్వరవీణ..
ఇది సరసాలాడిన చలి వీణ
ఇది చూపులు కలిసిన సుఖవీణ..
ఇది ముసిముసి నవ్వుల ముఖవీణ
ఝుమ్మని పలికిన ఎదవీణ..
నను రమ్మని పిలిచిన రసవీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
ఇది సరసాలాడిన చలివీణ
చరణం:1
ముట్టుకుంటే.. ముద్దువీణ..ఓ..
హత్తుకుంటే హాయి వీణ…..ఓ..
పడుచుగుండేకు పల్లవి తానై
పడతి నడకకు చరణం తానై
జాణలో వీణలే.. జావళీ పాడనీ
చందమామ మీద వాలి.. సన్నజాజి తేనే తాగి
హత్తుకు పోయే వేళ.. నా మత్తులు పెరిగే వేళల్లో
వీణలో తీగనే ..దోచుకో తీయగా
అది సరిగమ పాడిన స్వరవీణ
ఇది సరసాలాడిన చలి వీణ
ఇది చూపులు కలిసిన సుఖవీణ
ఇది ముసిముసి నవ్వుల ముఖవీణ
ఝుమ్మని పలికిన ఎదవీణ
నను రమ్మని పిలిచిన రసవీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
ఇది సరసాలాడిన చలివీణ
చరణం: 2
చీర చాటు.. సిగ్గువీణ.. ఓ..ఓ..
చేతికొస్తే చెంగువీణ..ఓ..ఓ..
జిలుగు నవ్వుల కీర్తనతానై..
వలపు మల్లెల వంతెన తానై
సోలినా అందమే… గాలిలో తేలనీ..
నీలినింగి నింగి పక్క మీదా.. తారకొక్క ముద్దు పెట్టి
అల్లరి చేసే వేళ..నిన్నల్లుకుపోయే వేళల్లో
రాగమై..భావమై..బంధమై పాడనా..
అది సరిగమ పాడిన స్వరవీణ
ఇది సరసాలాడిన చలివీణ
ఇది చూపులు కలిసిన సుఖవీణ
ఇది ముసిముసి నవ్వుల ముఖవీణ
ఝుమ్మని పలికిన ఎదవీణ
నను రమ్మని పిలిచిన రసవీణ
అది సరిగమ పాడిన స్వరవీణ
ఇది సరసాలాడిన చలివీణ