Ram Raheem (1974)

చిత్రం:  రామ్ రహీమ్ (1974)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  సి.నారాయణరెడ్డి
గానం:  యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: బాలకృష్ణ , హరిక్రిష్ణ , రోజారమని
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: కె.ఆర్.వి.ప్రసాద్ రావు
విడుదల తేది: 05.11.1974

పల్లవి:
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం..
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం: 1
ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం…
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం: 2
ఏ సుడిగాలి వీస్తుందో… ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో… ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా… ఏ నిమిషం ఏమవుతుందో

గాలికి చెదరదు…  వానకు తడవదు బంధం . . . మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే…  నిలిచిపోతుంది కలకాలం

ఎగిరే గాలిపటానికి దారం ఆధారం…
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

అహహా అహహా అహాహా హ్హా
అహహా అహహా అహాహా హ్హా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Guppedu Manasu (1979)
error: Content is protected !!