Rama Rama Krishna Krishna (2010)

rama rama krishna krishna 2010

చిత్రం: రామ రామ కృష్ణ కృష్ణ (2010)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: దలెర్ మెహంది, చైత్ర
నటీనటులు: రామ్ పోతినేని,  అర్జున్ సార్జా, ప్రియ ఆనంద్ , బిందుమాధవి, గ్రేసి సింగ్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 12.05.2010

తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నానే గోదారిలా
తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నానే గోదారిలా
ఎడమేమో వరి పైరు
కుడిలో కొబ్బరికోరు
ఎడమేమో వరి పైరు
కుడిలో కొబ్బరికోరు
ఏ వైపు దూకాలో ఎల్లాకిల

తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నానే గోదారిలా (2)

కోడి కోయించా యమ కారం దట్టించా
కోకలో చుట్టి నీ కోసం దాసుంచా
వేట వేయ్యించా వాటంగా వేయించా
పైటలో పెట్టి నీ పక్కకు వచ్చేశా
నోరు ఊరే అందాల విందు
అందరుంటే ఊరించకమ్మి
పైకి లేచే పరువాల బండి
ఆగనంది బేగా రావమ్మి
ఎడ్లేమో రెండంట బండెమో ఓటంట
ఇప్పేసి విదిలించు జర్నకోలా

తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నాది గోదారిలా (2)

నేల నేనంటా నా నాగలి నువ్వంటా
వానలో వచ్చి నన్నే దున్నుకోమంటా
పొయ్యి నేనంటా నా అగ్గివి నువ్వంటా
మోజుగా వచ్చి రాజేసుకోమంటా
పండుకోతే ప్రాయాల పంట
చందమామ నీ చంప పైన
పండుకోతే మొహాల మంట
సత్యభామ గుండెలోన
ఓ ముద్దు తనకిస్తు ఓ ముద్దు నా కిస్తు
వందేళ్లు ఆడేరా కర్రా బిళ్ళా

తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నానే గోదారిలా
తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా
నడిమధ్య ఉన్నానే గోదారిలా
ఎడమేమో వరి పైరు
కుడిలో కొబ్బరికోరు
ఎడమేమో వరి పైరు
కుడిలో కొబ్బరికోరు
ఏ వైపు దూకాలో ఎల్లాకిల

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top