Rambantu (1996)

చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి (All)
గానం:
నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఈశ్వరి రావు
దర్శకత్వం: బాపు
నిర్మాతలు: యమ్.చిట్టిబాబు, జి.జ్ఞానరాం హరీష్
విడుదల తేది: 1996

పల్లవి:
అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి చిన్ని గోవిందా (2)
అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా
రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా
నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు
చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటు పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట
రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక
సీలచ్చి దోచింది నీ చేతి ఎముక
మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక
తీర్చలేని ఋణము తీర్చుకోమనక

********  ********  ********

చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
బాల చిలక పరువాల సొగసు కనవేల
ఎందుకీ గోల తగువులింకేల
అధర మధురాల గ్రోల మురిపాల తేల రసకేళికే తగన
ఏల నన్నేల ఏల నీ దయ రాదు
పరాకు చేసేవేళ సమయము కాదు
రారా రామయ్యా రారా రారా శృంగార వీర
రారా నా జీవ గాత్రా సుమశర గోత్ర
చాల గడిచెనీ రేయి వలపు తరువాయి
తలుపులే మూయి దొరకదీ హాయి మనసు కనవోయి
మనకు తొలిరేయి కాంతపై ఏల….నన్నేల…..

చరణం: 1
వాహనాల మణిభూషణాల భవనాల
నేను నిను కోరితినా
లేత వయసు తొలిపూత సొగసు నీ చెంతనుంచక దాచితినా
సగము సగము జతకాని తనువుతో తనివి తీరక మనగలనా
కడలి తరగలా సుడులు తిరిగి కడకొంగు తెరలలో పొంగి పొరలి
ఈ వరద గోదారి వయసుకే దారి
పెళ్ళాడుకున్న ఓ బ్రహ్మచారి

********  ********  ********

చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
కుక్కుటేశ్వరా కునుకు చాలురా నీవు లేవరా నిదుర లేపరా(2)
కొక్కొరొక్కో మేలుకో(2)
కుక్కుటేశ్వరా కునుకు చాలురా

చరణం: 1
ఆటిన్ , ఇస్పేట్, డైమండ్ రాణుల అలక తీర్చర అప్పు చేసి
కాఫీ, సిగరెట్, ఉప్మా, పెసరెట్టు పరువు పెంచర పద్దు రాసి
సిగ్గు, శరములు గాలికి వదిలి క్లబ్బుకు కదలగ లెమ్మి ఇక లెమ్మి
రమ్మి ఇటు రమ్మి నిను నీవే చేయగా దొమ్మి
నీ కనులకు పొరలే కమ్మి సాటి ఆటకుల నమ్మి
నాటి ఆస్తి తెగనమ్మి ఢంకా పలాసుగ కుంకా కులాసగ

చరణం: 2
మధు దేవి గుడి తలుపు తెరిసేటి వేళాయె నిదర ఈరా ఇంక మేలుకో
పానకాల సామి పూనకేశ్వరి తోన ఊరేగు ఏళాయె మేలుకో
గోళి సోడా బుడ్డి కెవ్వుమంటున్నాది జాలి చూపి సామి మేలుకో
బారులో దెశీ, విదేశీయ మద్యాలు పద్యాలు పాడేను మేలుకో
తిన్నదరిగేదాక దున్నతో మారాజు కుడితి తాగుదువు మేలుకో

చరణం: 3
అల్లరెందుకు రారా నల్ల గోపాలా
చిందులాపర సామి చిన్ని గోవిందా (2)
అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగా
రవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలా
నలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దు
చమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దు
నలుగెట్టిన పిండి నాకు గణపతిగా
ముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగా
తల అంటు పోసేటి రాంబంటు పాట
కలగంటూ పాడాల కలవారి ఇంట
రాలచ్చి ఇచ్చింది ఈ రాచ పుటక
సీలచ్చి దోచింది నీ చేతి ఎముక
మీ ఉప్పు తిని అప్పు పడ్డాను గనక
తీర్చలేని ఋణము తీర్చుకోమనక

********  ********  ********

చిత్రం: రాంబంటు (1996)
సంగీతం: యమ్. యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం:

పల్లవి:
సందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి
సందెమసక చీరగట్టి సందు చూసి కన్ను కొట్టి
సిగపువ్వు తెమ్మంటే మగరాయుడు
అరిటిపువ్వు తెస్తాడు అడవి పురుషుడు

చరణం: 1
విన్నపాలు వినమంటే విసుగంటాడు
మురిపాల విందంటే ముసుగెడతాడు (2)
బుగ్గపండు కొరకడు పక్కపాలు అడగడు
పలకడు ఉలకడు పంచదార చిలకడు
కౌగిలింతలిమ్మంటే కరుణించాడు
ఆవులింతలంటాడు అవకతవకడు

చరణం: 2
పెదవి తేనెలందిస్తే పెడమోములు
తెల్లారిపోతున్నా చెలి నోములు (2)
పిల్ల సిగ్గు చచ్చినా మల్లె మొగ్గ విచ్చినా
కదలడు మెదలడు కలికి పురుషుడు
అందమంత నీదంటే అవతారుడు
అదిరదిరి పడతాడు ముదురు బెండడు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Detective Narada (1992)
error: Content is protected !!