చిత్రం: రాము (1987)
సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్. పి.బాలు, జానకి
నటీనటులు: బాలక్రిష్ణ , రజిని
దర్శకత్వం: వై.నాగేశ్వరరావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 31.07.1987
పల్లవి:
వానేమి చేస్తుతుందిరో
ఓ పిల్లగాడ వయసుంటే నాకాడ
ఈడు వలపుంటే నీ కాడ
కురిసి కురిసి పోతుంది కుళ్ళి కుళ్ళి చస్తోంది
కురిసి కురిసి పోతుంది కుళ్ళి కుళ్ళి చస్తోంది
కుచ్చి కౌగిలే నంచుకుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి
అరె లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి
వానేమి చేస్తుతుందిలే
చిన్నదాన మెరుపుంటే నీ కాడ
కోడె ఉరుముంటే నా కాడ
ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది
ముద్ద ముద్ద చేస్తుంది ముంత పొర్లిపోతుంది
ముగ్గు తొక్కిడౌతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి
అరె లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి
చరణం: 1
వాన జల్లు తేనేముళ్లు గిచ్చింది నిన్నెక్కడో
హోరుగాలి ఈడుగిల్లి పోయింది నన్నెక్కడో
చినుకులన్నీ చీరగట్టే నావళ్లు తుళ్ళింతగా
చిలిపి కన్ను ముద్దులాడే ఈ ప్రేమ అంటింతలో
చినుకులే చిటపట తాళమేవేయగా సాగేటి సయ్యాటలో
హే తనువులే గిలాగిలా రాగమే తియ్యగా రేగేటి కొట్లాటలో
అరె పిచ్చిముదిరి పోతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి
అరె లక్కిడి లక్కిడి తొక్కి తొక్కిడి లక్కి
వానేమి చేస్తుతుందిరో
ఓ పిల్లగాడ వయసుంటే నాకాడ
ఈడు వలపుంటే నీ కాడ
చరణం: 2
ఈడు కన్నా నిప్పులేదు ఈడొచ్చినా జంటగా
అంటుకున్నా తప్పులేదు వానొచ్చిన గంటలో
ప్రేమకన్నా తప్పులేదు పెనవేసిన పట్టులో
ముద్దుకన్నా హగ్గులేదు తాపాలు జోకొట్టుకో
కౌగిలే రక్షణ గాలిదే శిక్షగా కవ్వించుకో మెత్తగా
సిగ్గులే చిత్తుగా దగ్గరై బొత్తిగా కాజేయన కమ్మగా
హోయ్ సొక్కి సోలిపోతుంటే లక్కిడి తొక్కి లక్కిడి తొక్కి