Ranam Lyrics

Ranam (2006)

Ranam Lyrics

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా … లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: శ్రీ వర్ధిని
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Nallani Mabbu Chatu Song Telugu Lyrics

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా
సరేలే పోనీ అంటూ వెళితే నేనలా
చిటపటలాడి చిందేవెస్తవేంటలా

తెలుసా జడివాన తొలి చినుకై నువ్వు తాకేయగా
తడిసె నెరజాణ సిరి నెమలై కురి విప్పేయగా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
అరే ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే

ఎంత ధైర్యమే వాన మా ఇంటికొచ్చి నా పైన
చిటుకు చిటుకు అని జారీ చల్లని చినుకై ఎద చేరి

సరదాల వరదలో నేనుంటే పరువాల పొంగులను చూసే
వెలుగైనా చూడని ఒంపుల్లో తనువార జలకమే ఆడే

చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తవేమలా

వింత చేసేనీ వాన కురిసింది కొంత సేపైనా
తడిపి తడిపి నిలువెల్లా తపనై వెలిసి హరివిల్ల

చిరు జల్లు వలచిన ప్రాయాలే మరుమల్లె తీగకారిస్తే
సెలయేటి అద్దమును చూపించి మేరుపల్లె మేనిలో చేరి

చనువిస్తే తుంటరి వాన తొలి ప్రాయం దోచడమేనా
సరికాదే కొంటె వాన ఎద మీటి పోకే సోనా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడేనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలేనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తాను ఏడు రంగుల విల్లై ఊగెనులే

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

హే.. చిన్న రా.. చిన్న… లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: టిప్పు, అనురాధ పాలకుర్తి
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Hey Chinna Ra Chinna Song Telugu Lyrics

హే.. చిన్న రా.. చిన్న
హే.. చిన్న రా.. చిన్న

అంబ పలుకుతుంది
నాతో పెట్టుకుంటే చిలకా
దిమ్మ తిరిగి పొద్దే
దెబ్బ కొట్టానంటే గనకా

కళ్ళు తిరిగిపోవా చిన్న
పెట్టాడంటే మడత
పంబ రగిలి పోద చుమ్మా..
ఇచ్చాడంటే చురకా..

చిన్నమి వస్తావా..
సంగతే చూస్తావా..
నీవంట్లో.. నరం నరం రేగిపోతాదే..

అందుకే.. మెచ్చారా..
నీవెంటే.. వచ్చారా..
నువ్వంటే పడి పడి సచ్చిపోతా.. రా..

హే.. చిన్న రా.. చిన్న
హే.. చిన్న రా.. చిన్న

లల్లలార లయ్ లల్లలార లయ్
లల్లలార లయి లయి ||2||

లల్లలార లయ్ లల్లలార లయ్
లల్లలార లాయి లాయి ||2||

మీసం ఉంది రోషం ఉంది
దుమ్ము లేపేయ్ దమ్ము నాకుంది దాగుంది
మత్తుగుంది మస్తుగుంది
దూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది

ఓ..హ్ గుడు గుడు గుంజమా..
చేయ్ చూడవే చించిమా..
చిర్రు బుర్రు లాడిన చిత్తడవులే భామ

గడబిడ నారద ఏందిరా అసలు గొడవ
కలబడి సూడర చెడుగుడేలే బావ

అమ్మనీ.. ఎవ్వారం
దాటెనే.. గుడారం
ఎర్రెక్కి చిట పట పేలుతున్నావే..

ఓరినా.. బంగారం
నచ్చితే.. విడ్డూరం
వత్తావా.. తాడో పేడో తేల్చుకుందాము

హే.. చిన్న రా.. చిన్న
హే.. చిన్న రా.. చిన్న

కాళి కేస్తే ఏలి కేసి
ఏలి కేస్తే కాళి కేస్తవా..
ఓయ్.. చిన్న వా..

అన్న చాటు చిన్న దాన
సందు చాటున సంధి కొస్తావా..
హే.. వస్తావా..

హే.. మెరుపుల నాయక దూకుడాపర నువ్వికా..
నలుగురు చూసిన నవ్వి పోతరు మావా..

గొడుగొడు గోపిక సనుగుడాపవే నువ్వికా..
సల సల రేయిలో సరసమాడే దామ్మా..

పిల్లడా! అట్టాగా..
సంబడం సూత్తాగా..
అల్లుడయ్ ఇంటికొచ్చి ఏలుకుంటావా..

పిల్ల నే.. వత్తానే..
పల్లకే.. తెత్తానే..
మ్ అంటే.. పిప్పి ఢుం ఢుం వాయించేత్తానే..

హే.. చిన్న రా.. చిన్న
హే.. చిన్న రా.. చిన్న

చుమ్మా..

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు… లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాష శ్రీ
గానం: జస్సి గిఫ్ట్
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Bulligownu Vesukuni Song Telugu Lyrics

బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు
పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి
నా టెంత్ క్లాసుమెట్ గులాబి
బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె
ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా
లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా
ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా

స్పైడర్ మాన్ లా వెళితే నేను
చాటుగా పిలిచెను బేబి నన్ను
స్టైలుగ తెరిచెను కుక్కల బోను
కండలే పీకెను డాబరుమాను..

నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బోడ్డు చుట్టు
పదహారు ఇంజక్షన్లు చేయించుకొని
దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను
దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు

వన్ ఫైన్ మార్నింగ్
పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని
కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ..
ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే
జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోన నేను జారి పడ్డాను
జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను
లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి
వెచ్చని శ్వాసను ఉదేస్తుంటే
పాపని తలచి కళ్ళే తేరిచా
పంతుల్ని చూసి షాక్ అయిపొయా

నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు ||2||

ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని
డిసైడ్ అయిపొయి లవ్ డ్రామాకి కర్టెన్ దించేసి
స్టడీస్ మీద  కాన్సంట్రేషన్ మొదలుపెట్టను
అప్పుడు వన్ ఫైన్ అండ్ బ్యాడ్ నైట్…

టెక్స్ట్ బుక్  పట్టుకొని నైటౌట్ కోసమని
మేడపైకి వెళ్ళానండి ఓ రోజు…
మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు…..
పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని
ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు.
టాప్ ఎడ్జ్  మీద ఉంది ఇంటి స్విచ్ బోర్డ్
పైకెక్కి ఆంటి మీద పడ్డా  డైరెక్ట్
టైముకు వచ్చెను అంకుల్ బోసు
చేతికి తొదిగెను బాక్సింగ్ గ్లౌజ్
గుద్దితే పగిలేను చప్పిడీ నోసు
దెబ్బకి చేరాను నిమ్స్ లో బాసు..

నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు
గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు ||2||

హాస్పిటల్ లో 24 hours ఇంసెంటివ్ కేర్ లొ ఉన్నాను
డాక్టర్లు స్పెషల్ కేర్ తీసుకుంటే చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా..

వైట్  ఫ్రాక్ వెసుకోని హెడ్ కేప్ పెట్టుకోని
క్యాట్ వాక్ చేస్తుంటే ఓ నర్స్
దాని  షేప్ చూసి అయ్య నేను అదుర్స్..
సెంటిమెంట్  చూపి మరి ట్రీట్మెంట్  కోసమని
ఆయింట్మెంట్ పూసిందండి ఆ నర్సు
ఓ రంగు క్యాప్సల్ ఇచ్చిందండి ఆ నర్సు
ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి  రివర్స్
ఓపెన్ వార్డ్ కు తెచ్చేసింది బ్రోకెన్ హార్ట్ ని ఇచ్చేసింది
డాక్టర్ రౌండ్స్ కు వచ్చెసరికి
స్ట్రేచ్చర్ గాలికి వదిలేసింది.

నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

చెలి జాబిలి గిల్లిపోకుమా… లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కంది కొండ
గానం: నవీన్, సుచిత్ర
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Cheli Jabili Gillipokuma Song Telugu Lyrics

చెలి జాబిలి గిల్లిపోకుమా చలి వెన్నెల చల్లి పోకుమా
చిరు ఆశలు అల్లుకోకుమా మరుమల్లెలా జల్లు కాకుమా

వలా వేయు వలపు మిత్రమా నను చేరుట అంత ఇష్టమా
చిరు చిరు చినుకై చిందే చినుకువై చిటపట వానై చేరవు ఏయో
చలి చలి చలికి నీతో చెలిమికి చెలిగిలి కోసం చేరాను యోయో

దిగిరా దిగిరా తలపుల ఒళ్ళో దిగుదాం
దిగిరా దిగిరా వలపుకు ఓటే వేద్దాం

పదరా పదరా వయసుల లోతే చూద్దాం
పదరా పదరా చెలిమికి లేఖే రాద్దాం

మనసును తాకే చిరుగాలి మమతలు పోసే యో చిగురులు వేసే
పరుగులు తీసే పరువాలే కవితలు రాసే హూ చిరుసాడి చేసే

దిగిరా దిగిరా ఒకటికి తోడై ఉందాం దిగిరా దిగిరా హే
పదరా పదరా ప్రణయపు పులై పూదాము పదరా పదరా హోం

గల గల పారే చిరునవ్వే ఒక సెలయేరు హూ యెదలను చేరే
కిల కిల కూసే చెలి ఊసే గుస గుసలాడే హూ అలజడి చేసే

పదరా పదరా జతపడు జంట కడదాం పదరా పదరా
దిగిరా దిగిరా లోకమే మనమై పోదాం దిగిరా దిగిరా

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

వారెవ్వా చందమామ అందమంతా… లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మల్లిఖార్జున్, మహాలక్ష్మి అయ్యర్
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Varevva Chandamama Andamantha Song Telugu Lyrics

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

కొమ్మల్లో నేడే కుకులే మోగే
రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే
ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

జామ పండు చిలకే కొరికి రుచిని తెలిపింది
ఈ అతిథికి ఇమ్మంది
జున్ను పాలు చక్కర వేసి తినమని తువ్వాయి
తన భాగము ఇమ్మంది

చూడు చూడు గువ్వా తల్లి గోరు ముద్దలాగా నోరు ముద్దలు
చేనులోకి తొంగి చూడు చాటు మాటు సాగే తీపి ముద్దులు

ఇదంతా చూసి మతే పోతుంది
నిజంగా ఉరే భలేగా ఉంది
ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

ఒంపులు తిరిగి ఊగే జడతో పోటీ పడుతుంది
ఈ కదిలే సెలయేరు
కెంపుల పెదవి ఎరుపే చూసి కునుకే పోనంధీ
మా నిదుర గన్నేరు

చుక్కలున్న చిన్న మేక జింక పిల్లలాగా దుకమన్నది
రెక్క రెక్క నొక్కుతున్న పావురాల వంక చూడమన్నది

ఇలా నీతోనే ఖుషి చేస్తుంటే వసంతలెన్నో తలొంచి రావా
ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది
వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది

కొమ్మల్లో నేడే కుకులే మోగే
రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే
ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఘన ఘన పాడరా… లిరిక్స్

చిత్రం: రణం (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణకుమార్ కున్నత్ (కె.కె), సంగీత
నటీనటులు: గోపిచంద్ , కామ్న జఠ్మలాని
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 10.02.2006

Gana Gana Padara Song Telugu Lyrics

ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
అరె ధన ధన ధన ధన్ ధనక ఆడరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
అరె ధన ధన ధన ధన్ ధనక ఆడరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా..

నా పేరు చిన్నా నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా..
ఘన ఘన ఘన ఘన పాడరా..
ధన ధన ధన ధన ఆడరా..

హేయ్..!
నా పేరు చిన్నా నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా..
అటైనా.. ఇటైనా.., ఇక అడుగేశానంటే అడ్డేదిరా..
అటైనా.. ఇటైనా.., ఇక అనుకున్నానంటే అందాలిరా..

ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయికొరకు
ధన ధన ధన దండెత్తరా..

ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయికొరకు
ధన ధన ధన దండెత్తరా..

చుమ్మా..
లక లక లక లక లక లక
లక లక లక లకా.. లక

పకోడిలా పులుపు ఓ చేకోడిలా సరుకు
మొత్తం ఇస్తా నీకు అరె కొంచెం కొంచెం కొరుకు

అలా అలా అనకు అంటూ నన్నే తినకు
ఆకలి లేదు నాకు ఆ అమ్మాయ్ వచ్చే వరకు
ఆడా ఈడా ఈడా ఆడా రేగిందోయ్ మంటా..
ఆ మంటే తగ్గే మందే నాకు ఇచ్చేయ్ మంటా..
మంటే ఉంటే తండా పాని ఇస్తా లెమ్మంటా..
నా ఇంటా వంటా తంటా అన్నీ తానేనంటా..

ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయికొరకు
ధన ధన ధన దండెత్తరా..

ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయికొరకు
ధన ధన ధన దండెత్తరా..

చింతామణి డ్రామా మందాకినీ సినిమా..
చూపిస్తాలే మామ నువ్వు చీకట్లోనే రామ్మా..
డ్రామా కాదే ప్రేమ అది ఇంకా తియ్యని సినిమా..
చూపించేది నేను ఇంక చూసేది ఆ భామ
జుమ్మావరం చుమ్మావరం నీతోవచ్చేస్తా..
అరె గుమ్మావరం అంగట్లోన అడిగిందిస్తా..
ఆమె వరం ప్రేమే వరం అంతే చాలంటా..
వేరే వరం ఏదీ నాకు వద్దని అంటా..

ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయికొరకు
ధన ధన ధన దండెత్తరా..
ఘన ఘన ఘన గొంతెత్తరా.. అమ్మాయిమెళ్ళో
ధన ధన ధన దండెయ్యరా..

నా పేరు చిన్నా నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా..
నా పేరు చిన్నా నా మనసు వెన్న సింహాని కన్నా పొగరుందిరా..

ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
అరె ధన ధన ధన ధన్ ధనక ఆడరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
అరె ధన ధన ధన ధన్ ధనక ఆడరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా..
ఘన ఘన ఘన ఘన్ ఘన ఘన పాడరా..
శివమెత్తి నువ్వు సత్తువంతా చూపరా..

Ranam Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Nenu Sailaja (2016)
error: Content is protected !!