నా కనులు ఎపుడూ… లిరిక్స్
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 26.03.2021
Naa Kanulu Yepudu Song Telugu Lyrics
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
చేదుపై తీపిలా… రేయిపై రంగులా
నేలపై నింగిలా
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
ఎపుడూ లేని ఈ సంతోషాన్ని
దాచాలంటే మది చాలో లేదో
ఎపుడో రాని ఈ ఆనందాన్ని
పొందే హక్కే నాకుందో లేదో
నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం
నాకివాళ సొంతమై అందేనే
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నన్నే నేనే కలిసానో ఏమో
నాకే నేనే తెలిసానో ఏమో
నీలో నన్నే చూశానో ఏమో
నాలా నేనే మారానో ఏమో
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే
ఓ క్షణం పెంచిన
గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా
నా కనులు ఎపుడూ కననె కనని
పెదవులెపుడూ అననె అనని
హృదయమెపుడూ విననె విననీ
మాయలో తేలుతున్నా
నా మనసు తలుపే… తెరచి తెరచి
వెలుగు తెరలే… పరచి పరచి
కలలు నిజమై… ఎదుట నిలిచి
పిలిచెనే ఈ క్షణాన
Rang de Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
బస్టాండే బస్టాండే.. ఇక బతుకే బస్టాండే… లిరిక్స్
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 26.03.2021
Bus Stande Bus Stande Song Telugu Lyrics
నాన్న నవ్వుతుంది, నేను కట్టలేను నాన్న..!!
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే, హ్మ్
ఈ రంగురంగు లోకం, హ్మ్… సీకట్లోకి జారే, హ్మ్
లవ్లీగుండే కలలే, హ్మ్… లైఫే లేనిదాయే, హ్మ్
స్మైలీ లాంటి పేసే, హ్మ్… స్మైలే లేనిదాయే
నీళ్ళు లేని బావిలోన… కప్పలాగ తేలిపోయే
జాలరేదో గాలమేస్తే… చేపలాగ దొరికిపోయే
తీసుకున్న గొయ్యిలోన… కాలుకాస్త జారిపోయే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే
ఈ రంగురంగు లోకం, హ్మ్… ఛీ–కట్లోకి జారే
సలసల కాగు నీట్లో… వేళ్ళే పెట్టినానురో
కారమంటుకున్న చేత్తో… కళ్ళే నలిపినానురో
హ్మ్, ఎవరులేని చోట, హ్మ్… గావుకేక అయింది లైఫే, హ్మ్
ఫ్రెండులా ఉండే ఫేటే, హ్మ్… ఫుట్ బాల్ ఆడే నాతోటే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
స్లేటే పక్కనుంటదే… కానీ చాక్ పీస్ చిక్కనంటదే, యే
ప్లేట్ లో ఫుడ్డు ఉంటదే… కానీ నోటికి తాళముంటదే
హ్మ్, లైటు స్విచ్చెయ్యగానే, హ్మ్… బల్బ్ మాడిపోయినట్టు, హ్మ్
లైఫు స్టార్ట్ అవ్వగానే, హ్మ్… నా ఫ్యూచర్ పంక్చర్ అయ్యనే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే
Rang de Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ఏమిటో ఇది.. వివరించలేనిది… లిరిక్స్
చిత్రం: రంగ్ దే (2021)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ కపిలన్, హరిప్రియ
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది: 26.03.2021
Emito Idhi Song Telugu Lyrics
ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది…
అందుకే ఈ మౌనమే… భాష అయినది
కోరుకోని కోరికేదో తీరుతున్నది…
ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది
అలలా నా మనసు తేలుతుందే… ఏఏ ఏ
వలలా నువు నన్ను అల్లుతుంటే… ఏఏ ఏ
కలలా చేజారిపోకముందే… ఏఏ ఏ
శిలలా సమయాన్ని నిలపమందే… ఏఏ ఏ
నడక మరిచి నీ అడుగు ఒడిన… నా అడుగు ఆగుతుందే
నడక నేర్చి నీ పెదవి పైన… నా పెదవి కదులుతుందే
ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ… ఓఓఓ ఓ
ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది
మెరిసే ఒక కొత్త వెలుగు నాలో… ఓఓ ఓ
కలిపే ఒక కొత్త నిన్ను నాలో… ఓఓ ఓ
నేనే ఉన్నంత వరకు నీతో… ఓఓ ఓ
నిన్నే చిరునవ్వు విడవదనుకో… ఓఓ ఓ
చినుకు పిలుపు విని… నెమలి పింఛమున రంగులెగసినట్టు
వలపు పిలుపు విని చిన్ని మనసు… చిందేసే ఆగనంటూ
కోరుకున్న కాలమేదో చేరుతున్నది… ఓఓఓ ఓ
ఏమిటో ఇది… వివరించలేనిది
మది ఆగమన్నది… తనువాగనన్నది
Rang de Movie Songs Telugu Lyrics
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
aakasam nee haddhura movie
Please check it’s already available
super
super
super song
hiii
awesome songs
ss
beautiful ???? girl
very good song lyrics but the old songs lyrics are not there please involve it
oorantha vennela song not available
is not available 🥺
😎Now it’s🎁