చిత్రం: రంగూన్ రౌడీ (1979)
సంగీతం: జె. వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, దీప
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే శోభనాద్రి
విడుదల తేది: 1979
(కృష్ణంరాజు 100 వ సినిమా అలాగే బర్మాలో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమా)
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా
సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా
కోరంగ చేరంగ కోపంగ చూడొద్దు
కొంగొట్టు కొచ్చెయ్ టింగు రంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
కులుకు పలుకు చూస్తావుంటే
ఒళ్ళు పులకరించి పోతావుంది
నీ మీసకట్టు చూస్తావుంటే
నాకు మిడుకు మిడుకు మంటావుందే
చిలకా పలికింది రయ్యో
సిగ్గు పట్టింది రయ్యో
కొంపా ముంచింది రయ్యో
లగుచికు లగుచికు లగుచికు బావయ్యో
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
సారంగో రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
మాయరోగమొచ్చిందంటే సచ్చినోడ
మల్లెపూల మంత్రమేయనా
ఆడ జబ్బు ముదిరిందంటే
అండగాడ ఈడ నిన్ను పాతరేయన
మబ్బు కమ్మింది రయ్యో
జబ్బు పొమ్మందిరయ్యో
దిబ్బ రమ్మందిరయ్యో
లగుచికు లగుచికు లగుచికు బావయ్యో రావయ్యో
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా
సిగ్గెందుకంట శ్రీరంగా బొగ్గెయ్యమాకు సమీరంగా
కోరంగ చేరంగ కోపంగ చూడొద్దు
కొంగొట్టు కొచ్చెయ్ టింగు రంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా
రాజులేనప్పుడు సారంగో
నువు రారాద పోరాద సారంగా