Rangula Ratnam (1966)

rangula ratnam 1966

చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: గంటసాల, ఎస్.జానకి
నటీనటులు: చంద్రమోహన్, వారణాసి రామ్మోహనరావు, వాణిశ్రీ, అంజలీ దేవి, రేఖ (చైల్డ్ ఆర్టిస్ట్)
దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి
నిర్మాత: బి.ఎన్. రెడ్డి
విడుదల తేది: 1966

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాలు నే నడువలేను
ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా .. మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా

కలవారినేకాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణమయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగవల్లి
అడగవే మాయమ్మా అలిమేలుమంగా..

******   *******   *******

చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం:  బి.గోపాళం, ఎస్.జానకి

వెన్నెల రేయి చందమామ వెచ్చ గా ఉన్నది మామ
మనాసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది
తీరికి వెన్నెల కాయు వేళ
దొర వయసులో పిల్ల
నీ కాలాగే ఉంటది మనసాఅలాగే ఉంటది

చల్లని గాలి తోడు గ రాగ సైగలథొ నువ్వు చూడగా
కను సైగలథొ వల ఏయైగా

గున్దెలదరగా నీతో పాటు గా
గుస గుస లాడగా సిగ్గౌతున్నది

చరణం: 1
అహా నడకల తోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగ
చిరు నవ్వులతో పక్క నిల్వగ
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు చిన్న బుచ్చుకొని చిత్తై పొవటె

చరణం: 2
తీయ తీయగా సరస మాడి చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువ్వు మత్తెక్కించాకే
మనసే నాతో రాలెదన్నదొఇ

******   *******   *******

చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం:  పి. సుశీల

పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే…కనిపించి అంతలో…
కన్ను మరుగాయే…కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే…ఆ..ఆ..ఆ..ఆ

చరణం: 1
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ…
మనసారా నిను చూడలేనైతి స్వామీ…
కరుణించి ఒకసారి కనిపించవేమీ…

చరణం: 2
అందాల కన్నయ్య కనిపించగానే…
బృందావనమెల్ల పులకించిపొయే…
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే…
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే…ఆ..ఆ..ఆ..ఆ

చరణం: 3
వలపుతో పెనవేయు పారిజాతమునై… ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై… నీ చరణకమలాల నలిగి పోనీయవా…
ఆ..ఆ..ఆ..ఆ..

కనరాని దేవుడే కనిపించినాడే…
కనిపించి అంతలో కన్ను మరుగాయే … కన్ను మరుగాయే..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top