Ravanna (2000)

చిత్రం: రవన్న (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర , రాజేష్
నటీనటులు: రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మాగంటి గోపీనాథ్
విడుదల తేది: 03.03.2000

పల్లవి:
నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నది
ఆ గోల తెలిసేదెలా అంత దూరముంటే
దూరాలు కరిగేదెలా జంట చేరకుంటే
కౌగిళ్ళు చేరక ఒళ్లే సేద తీరక
తీరేదెలాగటా కిర్రెక్కించు కోరిక

నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నది

చరణం: 1
నా వేడి నరాలలో నయాగర కథాకలి
సాగింది తుఫానుగా కులాష కేళి
నీ వేలి నిషాలతో సీతారగా అయ్యే చెలి
ఊగింది హుషారుగా సుఖాల తేళి
ఉప్పొంగింది నిప్పుల వాగు
ఉస్సూరంది పున్నమి నాగు
తెలవారేలా కలతీరేలా చెలరేగే వేగాన
తెగేదా తగాదా ఎలా ఏం చేసినా

నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నది

చరణం: 2
చీరంటే చిరాకని మరీ అలా ఉడుక్కుని
చూడొద్దు ఎర్రెర్రగా ఉస్సూరనేలా
నీ ఒంటినతుక్కోని ఉంటుందిగా అదేం పని
నాక్కాస్త అసూయగా చిర్రెకాకిపోదా
హేయ్ నీ సొమ్మేగా కాపాడింది
నా చూపొస్తే ఛి పో అంది
తరుణం రాని తలవంచుకొని
తనె తప్పుకుపోతుంది
అదేదో ఇవ్వాళే అనేద్దాం గమ్ముని

నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నది
మనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నది
ఆ గోల తెలిసేదెలా అంత దూరముంటే
దూరాలు కరిగేదెలా జంట చేరకుంటే
కౌగిళ్ళు చేరక ఒళ్లే సేద తీరక
తీరేదెలాగటా కిర్రెక్కించు కోరిక

error: Content is protected !!