చిత్రం: రావణుడే రాముడైతే (1979)
సంగీతం: జి.కె. వెంకటేష్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి
నటీనటులు: నాగేశ్వరరావు, లత సేతుపతి, జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: ఎన్. ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 14.02.1979
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడనీ పాడని నవ్య నాధానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ…
నీ పాటలే పాడనీ…
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ…
ఆ… కదలాడని పాడనీ…
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాధానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
********* ********* *********
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే…
చరణం: 1
నీ గీతి నేనై… నా అనుభూతి నీవైతే చాలు…
పదివేలు… కోరుకోనింక ఏ నందనాలు …
ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు…
అంతే చాలు… ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే
చరణం: 2
ఆ కొండపైనే ఆగే మబ్బు తానే ఏమంది… ఏమంటుంది?
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే ఏమంది… ఏమంటుంది?
పదికాలాలు ఉంటానంటుంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ… ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం… మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే