చిత్రం: రాయుడు (1998)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం:
గానం: కె.జె. యేసుదాస్
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య (ప్రత్యేక పాత్రలో), రచన, ప్రత్యూష
దర్శకత్వం: రవిరాజ పినిశెట్టి
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 1998
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
కళక్కురా జీవితాన హాయనీ
లోకంలో బంధాలే మాయనీ
ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీ
వీపున జో కొట్టింది ముందు చూపు ఉండాలనీ
చందమామ వస్తాడని తహ తహలే రేపింది
రాయిలాంటి సంగంలో గుండె గట్టి పరచాలని
అమ్మ వేదం అర్థమాయే
ఉన్న బ్రమలే తొలగి పోయే
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
లాలపోసి మసి బొగ్గును నుదిట మీద పూసిందీ
పాడు దిస్టి నీ పై పడుతుందని కాదు
చల్లనైన తల్లిలోన తత్వమొకటి దాగుంది
మనిషికింక తుదిమజిలీ మరుభూమి మసియేనని
వచ్చి పోయే… జన్మలైన
చచ్చి పోనీ… ఆశ నాది
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట
అందులో దాగుంది నీ బ్రతుకు బాట
కొల్కిరా జీవితాన హాయనీ
లోకంలో బంధాలే మాయనీ