డించిక్ డించిక్ డింకా… లిరిక్స్
చిత్రం: రెడ్ (2021)
నటీనటులు: రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాకేత్, కీర్తన శర్మ
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవి కిశోర్
విడుదల తేది: 14.01.2021
Dinchak Song Telugu Lyrics
ఎక్కడీ దానవే… సక్కనీ కోమలి
ఒక్కదానివి ఉన్నావేందే… వస్తవా భీమిలీ
గంపెడు ఆశతో… దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగాళ్ళంతా… ఇడిసినా ఫ్యామిలీ
అయ్..చెప్పుకుంటే బాధ… అరె, తీరిపోద్ది చంచిత
అరె..సెట్టంతా మావోడున్నాడు… సెట్టు సేత్తడు నీ కథా
ఏడి… ఎక్కడున్నడు..?
నా కళ్ళకు కనిపించమను, మీ హీరోని కూసింత
పన్నెండు డబ్బాల… పాసెంజర్ బండెక్కి…
పదకొండు గంటలకు… పోదమన్నడు బొంబైకి
పదిమంది సూచారని… సాటుగ వచ్చా టేషనుకి
హే..తొమ్మిదో నెంబర్ మీదికి… రైలొచ్చేరొవ్వంతటికే
సల్లటి ఏసీ బోగీలో… సూపిత్తాడే ఒకటికి
హాయ్ చెప్పి దుప్పటి ఏసి… దూరిండమ్మీ మాపటికీ
కూ చుక్ చుక్ కూతలు తప్ప… మోతలు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి… జంపయ్యిండే పొద్దటికీ
ఆయ్… డించిక్ డించిక్ డింకా… ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా… మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా… తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా… తీగ లాగితే కదిలే డొంకా
గుంజూతుంటే చైను… గురునాథం పిలిచే నన్ను
కట్టే చేస్తే సీను… చెన్నైలో తేలాను
రంజూగుందే స్టోరీ… ఏటయ్యిందే ఈసారి
కంచిపట్టు సారీ… నలిగిందా లేదా జారి
ఇంగీలీషు సినిమా సూద్దాం… ఇంగవా అన్నాడు
ఎంగిలీ ముద్దులంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా… నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో… నైటు హుషారు
లుంగీ డాన్స్ చేద్దామంటూ… పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రుపెట్టి… మెక్కి ఇడ్లీ సాంబారు, ఊఊ
ఆయ్… డించిక్ డించిక్ డింకా… ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా… మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా… తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా… తీగ లాగితే కదిలే డొంకా
తిప్పి సందు సందూ… నా వల్ల కాదని చందు
ఛార్మినారు ముందు… తాగించాడే మందు
జాగాలన్నీ చుట్టీ… మా వైజాగోచ్చావా చిట్టి
బాగుంటాదే సిట్టీ… చూస్తావా చెమటే పట్టీ
లైటు హౌజులాగా ఉంది బాసు కటౌటు
రూటు పట్టి రౌండేసొద్దాం… పట్నం సూపెట్టు
చెండూ లాగా మెత్తగా ఉంది… పాప నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే… తిరుగుతాయే కళ్ళు
ఎత్తుపళ్ళం ఎక్కి దిగి… వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసి ఈన్నే ఉంటా… ఇచ్చావంటే సిగ్నళ్ళు, ఊఊ
ఆయ్… డించిక్ డించిక్ డింకా… ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా… మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా… తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా… తీగ లాగితే కదిలే డొంకా
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
కౌన్ హై అచ్చా.. కౌన్ హై లుచ్చా… లిరిక్స్
చిత్రం: రెడ్ (2021)
నటీనటులు: రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవి కిశోర్
విడుదల తేది: 14.01.2021
Kaun Acha Kaun Lucha Song Telugu Lyrics
వాడు వీడు బ్యాడు అంటూ… నువ్వు చెప్పకు, దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే… గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు…
నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని… చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా… మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా
కౌన్ హై అచ్చా… కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా… ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ… కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా… ఇదంతా నీ పిచ్చా
నింగినేల చూశా… నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త…
మారిపోద్ది న్యాయం… నోటు రేటు మారేకొద్ది
వెతకమాకు దాన్ని… ఆ
అంతా తెలుసని అంటావు… తెలిసిందేదైనా అంతా కానేకాదు, సమ్జోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో… ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా…
కౌన్ హై అచ్చా… కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా… ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ… కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా… ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే… నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్…
పూటకొక్క మాట… పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా… చెత్త నా కొ**
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా… ఒప్పుకోవు ఉన్న నిజాన్ని, అహ్హాహా
నాటకాలు ఆడు జగాన… నీ అద్దం ముందు ఆపు కొంతైనా, హేయ్ థు
కౌన్ హై అచ్చా… కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా… ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ… కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా… ఇదంతా నీ పిచ్చా
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
నువ్వే నువ్వే… లిరిక్స్
చిత్రం: రెడ్ (2021)
నటీనటులు: రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవి కిశోర్
విడుదల తేది: 14.01.2021
Nuvve Nuvve Song Telugu Lyrics
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
నీ స్పర్శే చెప్పింది.. నే సగమేవున్నానంటూ..
నీలో కరిగిన్నాడే.. నేనంటూ పూర్తయినట్టు…
ఇన్నాళ్లు ఉన్నట్టు.. నాక్కుడా తెలియదు ఒట్టు..
నువ్వంటూ రాకుంటే.. నేనుండున్నా లేనట్టు…
ఈ లోకంలో మనమే.. తొలి జంటని..
అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా..
ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని..
చాటిస్తే తప్పుందా నిజం కాదా…
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..
ఎందుకు జీవించాలో.. అనిపించిందంటే చాలు..
ఇందుకు అంటూ నిన్నే.. చూపిస్తాయి ప్రాణాలు..
ఎవ్వరితో చెప్పొద్దు.. మన ఇద్దరిదే ఈ గుట్టు..
నువ్వే నా గుండెల్లో… గువ్వల్లే గూడును కట్టు…
ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా…
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
నేనున్నానన్నది నువ్వే కదా…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Red Movie Songs Telugu Lyrics
GANESH
Hi. GANESH
all hits songs
ok super
super
super
I Love you so much Pothineni Ram💋❤💞💔