Rendu Kutumbala Katha (1970)

rendu kutumbala katha 1970

చిత్రం: రెండు కుటుంబాల కథ (1970)
సంగీతం: గంటసాల
సాహిత్యం: దాశరథి, కొసరాజు
నటీనటులు: కృష్ణ, నాగయ్య , ప్రభాకర్ రెడ్డి,  విజయనిర్మల, హేమలత
కథ: శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి
మాటలు: పినిసెట్టి
దర్శకత్వం: పి.సాంబశివరావు
దర్శకత్వ పర్యవేక్షణ: సి.ఎస్.రావు
నిర్మాత: వి.ఎస్.గాంధీ
బ్యానర్: గిరిధర్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 30.10.1970

చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: గంటసాల
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే

చిన్ననాడు గోపెమ్మల చిత్తములలరించి
మన్ను తిన్న ఆ నోటనే మిన్నులన్నీ చూపించి
కాళీయుణి పడగలపై లీలగా నటియించి
సురలు నరులు మురిసిపొవ ధరణినేలు గోపాలుని

వేణుగానలోలుని గన.. వేయి కనులు చాలవులే

అతని పెదవి సోకినంత అమృతము కురిసేను
అతని చేయి తాకినంత బ్రతుకే విరిసేను
సుందర యమునా…ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ…
సుందర యమునా తటిలో సుందర యమునా తటిలో
సుందర యమునా తటిలో బృందావన సీమలలో
కలసి మెలిసి అలసి సొలసి వలపు తెలుపు వేళలో

వేణుగానలోలుని గన..వేయి కనులు చాలవులే
సరసరాగ మాధురిలో సకల జగము సోలునులే
జగము సోలునులే
వేణుగానలోలుని గన వేయి కనులు చాలవులే

*******  *******  *******

చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: గంటసాల
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

పల్లవి:
ఆ.. ఆ… ఆ…
ఆ.. ఆ… ఆ.. ఆ.. ఆ.. ఆ…

మదిలో విరిసే తీయని రాగం
మైమరపించేనూ… ఏవో మమతలు పెంచేనూ

మదిలో విరిసే తీయని రాగం
మైమరపించేనూ… ఏవో మమతలు పెంచేనూ

చరణం: 1
అల్లరి చేసే పిల్లగాలి.. మల్లెలు నాపై జల్లు వేళ
అల్లరి చేసే పిల్లగాలి.. మల్లెలు నాపై జల్లు వేళ

కోరికలన్నీ ఒకేసారి ఎగసి… ఆ.. ఆ.. హా.. ఆ.. ఆ..
కోరికలన్నీ ఒకేసారి ఎగసి.. ఆకాశంలో హంసల రీతి
హాయిగ సాగేనులే…

మదిలో విరిసే తీయని రాగం
మైమరపించేనూ… ఏవో మమతలు పెంచేనూ

చరణం: 2
పరవశమంది పాట పాడి… గానలహరిలో తేలి ఆడి
పరవశమంది పాట పాడి… గానలహరిలో తేలి ఆడి

హృదయములోనా వసంతాలు పూయా…
హృదయములోనా వసంతాలు పూయా…
కన్నులలోనా వెన్నెల కురియా… కాలము కరగాలిలే..

మదిలో విరిసే తీయని రాగం
మైమరపించేనూ… ఏవో మమతలు పెంచేనూ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top