చిత్రం: రైడ్ (2009)
సంగీతం: హేమచంద్ర ( బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి శివాని, జి.వేణుగోపాల్
నటీనటులు: నాని, తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 2009
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
ఆ దంచు దంచు బాగ దంచు
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పెట్టినా..
ఆగకుండ, ఆపకుండ, అందకుండ, కందకుండ..
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరదర
హే దంచు దంచు దంచు…
పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి..
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి..కోక వయసు పొంగనియ్యి..
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి…మరి ఏ చెయ్యి దించితేమి
కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే!!
హ.. దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ
దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్..నేను దంచితే నీ గుండె దడ దడ దడ దడ
హే దంచు బేబీ దంచు దంచు బేబీ దంచు
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు..
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు..
ఎగిరెగిరీ పైన పడకు ఇగురు చూస్తే టముకు టముకు
ఏ కంటపడితేమి ఎవ్వరేమంటే మనకేమీ
నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే..
నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారున్ని నేను
అరె దంచవే మేనత్త కూతురోయ్..
వడ్లు దంచవే నా గుండెలదర
దంచుతా మంగమ్మ మనవడోయ్
నేను దంచితే నీ గుండె దడదడ