నాగలి-రోల్ రైడా… లిరిక్స్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: రాప్-రోల్ రైడా, హుక్-శ్రీ జో
గానం: ఫోక్-ప్రవీణ్ లక్కరాజు, రాప్-రోల్ రైడా
నటీనటులు: అమిత్ తివారి, రోల్ రైడా
దర్శకత్వం: హరికాంత్ గుణమ్మగారి
నిర్మాణం: అజయ్ మైసూర్
విడుదల తేది: 14.08.2020
హుక్:
యాడకెళ్ళి వచ్చావు రైతన్నో..
యాడకెళ్ళి పోయావు రైతన్నా..
యాది మర్చిపోయారు.. రైతన్నో.. రైతన్నా..
ర్యాప్:
లెట్ మీ టెల్ యు ఆల్ ఏ స్టోరీ..
రెండు వేల పదకొండు నాడే..
ఘోరాతి దారుణం విన్నానే..
లక్షల శవాలు దొరికాయ్
బాంబ్ బ్లాస్ట్ కాదయ్యో..
టెర్రరిస్ట్ కాదయ్యో..
ఏంటని టీవీ వార్తలు వింటే..
రైతుల ఆత్మ హత్యలు అంట అయ్యో..
వాళ్ల తిండి తినే కదా మనం బతుకుతున్నాం..
తిండి పెట్టె వాడ్నే కదా మనం చంపేస్తున్నాం..
టెక్నాలజీ అంటూ పిల్లలకేమి నేర్పిస్తున్నాం..
కంపెనీ అంటూ రైతుల పొట్టలు మీద తన్నుతున్నాం..
వర్షాలు లేవ్.. ఇంట్లోవాళ్ళకి.. డగ్ డగ్ డగ్ ..
పంటలు లేవ్ .. ఇంట్లోవాళ్లకి.. డగ్ డగ్ డగ్
డబ్బులు లేవ్.. బ్యాంకోల్లే వస్తే.. డగ్ డగ్.. డగ్
గిన్నెలు ఉన్నాయ్.. బియ్యం లేవ్.. డగ్ డగ్ డగ్..
మనం మస్తుగా ఉంటాము
మస్తు పుష్టిగా తింటాము
రైతులు పస్తులు ఉంటారు
కొందరు పుస్తెలు అమ్మారు
వాళ్లకి కావలి కావాలీ..
మేక ఆవులు కావాలీ..
నీకు బువ్వ కావాలీ..
వాళ్లకి నువ్వే కావాలీ..
హుక్:
యాడకెళ్ళి వచ్చావు రైతన్నో..
యాడకెళ్ళి పోయావు రైతన్నా..
యాది మర్చిపోయారు.. రైతన్నో.. ఓహ్.. హ్.. హ్..
ర్యాప్:
చేతులు దొరల కాళ్ళ మీద పడ్డాయి..
ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి..
ఉయ్యాల కోసం కట్టిన తాళ్లే..
ఉరితాళ్ళుగా మారాయి..
పొలంలో పండే.. పండ్ల కన్నా..
పక్కన ఉండే సమాధులు ఎక్కువ
గీతలు రాతలు మారుస్తాయి..
కానీ రైతుల దెబ్బలే గీతలు రా…
మబ్బునలేచి.. మబ్బులు రాకపోతే భయము
చెరువు ఎండిపోతే.. చేనుకి భయము
గంజి లేకపోతే.. గుడిసెకి భయము
తిరిగి రాకపోతే.. తాళికి భయము
మొక్కల కోసం, మొక్కులు మొక్కినా..
వాన దేవుడే యముడు రా..
చినిగిన చొక్కాలు.. చేతికి పొక్కులు..
బురదలో లేకుంటే గడవదు రా..
సముద్రమంతా వేసిన పంటకి,
ఆదాయం ఏమో చినుకు రా..
పిల్లలు పెద్దలు, అక్కలు చెల్లెలు,
అన్నలు తమ్ములు, ఏమైపోతారు…
నేలని నమ్మితే.., నేలపాలు అయ్యారు..
నీళ్లని నమ్మితే.., నేలల్లో కలిపారు..
ఎరువుని నమ్మితే.., ఎర్రోన్ని చేసారు..
దేవుడ్ని నమ్మితే.., దేవుడే పిలిచాడు..
హుక్:
యాడకెళ్ళి వచ్చావు రైతన్నో..
యాడకెళ్ళి పోయావు రైతన్నా..
యాది మర్చిపోయారు.. రైతన్నో.. ఓహ్.. హ్.. హ్..
ర్యాప్:
బైటికి రా.. భయపడకుండా.. బైటికి రా..
బైటికి రా… ఎదురు తిరుగు.. బైటికి రా..
బైటికి రా.. ఉరుముకుంటూ.. బైటికి రా..
బైటికి రా.. పులివై నువ్వే.. బైటికి రా…
మేము బతికితే నువ్వు బతుకుతావ్..
ఆలోచించు కొంచెం ఎదుగుతావ్..
దొరికితే.. చెరుకుతాం.. లంచగొండోల్లని నరుకుతాం..
ఆహ్ ప్రకృతి కూడా.. మా పై కక్కూర్తి లే రా..
భూముల దోపిడీ దాడి.. మా పై ఆగదు కాదా..
అందుకే పురుగుల మందూ.. పోసి పెట్టాల..
కల్తీ చేస్తే.. కోసి పెట్టాల..
మోసం చేస్తే.. మస్తు కొట్టాల..
భయపడి వాడు దండం పెట్టాలా..
మమల్ని పెడితే.. తంటాల తంటాల
కాల్చేస్తాం నిన్ను మంటలా.. మంటల
చివరి కోరికలు ఏమైనా ఉంటే..
చెప్పుకో.. ఇప్పుడే అందరి ముందర
హుక్:
ప్రాణం ఇచ్చుకుంటాము రైతన్నో…
నేలనిడిచి పోమాకు రైతన్నా…
నువ్వు లేక బువ్వేది రైతన్నో… రైతన్నా..ఓ ఓ
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super hit annya