చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: టి.త్రివిక్రమ రావు
విడుదల తేది: 07.05.1992
అరె ఓ సాంబ ఆయిరే రంబా
అరె ఓ రంబా ఆయారే రేంబో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది లవ్వాడదాం చలో రె రాణీ…
అరె ఓ సాంబ ఆయిరే రంబా
అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది అయినాసరే లొంగను ఛా ఛా
అరె ఓ రంబా ఆయారే సాంబా
చరణం: 1
ఓ కేడి.. కనకమ్మో
ఓ కేడి కనకమ్మో కవ్వించకే ముద్దు గుమ్మో
షేకించి బ్రేకించి పగ్గాలు వేస్తానే బొమ్మో
ఏదన్నా ఎంతున్నా నేరాలు రాసుంది కాడా
ఊరంతా చూస్తారు వలవెయ్ కు నీ సోకుమాడ
కమ్మలు పెడతా గాజులు పెడతా
ఒల్లోకొస్తే గుడులే కడతా
నా మాట విని చల్ రె రాణీ…
అరె ఓ రంబా ఆయారే రేంబో
అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చరణం: 2
ఆ లాటిలు.. చూపించి
లాటిలు చూపించి బెదిరించకోయ్ టింగు రంగా
ప్రేమంటూ నీకుంటే దరి చేరనా సుబ్బరంగా
రంగేళి రంగమ్మా ఓ చోటు చూసేసుకుందాం
నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం
చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది లేటెెందుకిక చల్ రె రాజా
అరె ఓ సాంబ ఆయిరే రంబా
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
మస్క కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది లవ్వాడదాం చల్ రె రాణీ
అరె ఓ రంబా ఆయారే రేంబో