Rudhramadevi (2015)
Rudhramadevi (2015)

Rudhramadevi (2015)

చిత్రం: రుద్రమదేవి (2015)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: అనుష్క , రానా, అల్లు అర్జున్
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: గుణశేఖర్
విడుదల తేది: 09.10.2015

చిత్రం: రుద్రమదేవి (2015)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయ ఘోషల్

పల్లవి:
పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అది ఇదియని తలచి
అదుపెరగని మురిపెం పిలిచి
మధుర భవనల సుధల వాహిణిగ
ఎగసిన హృదయంతో

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

చరణం: 1
నేలపైకి దూకే తొలి వాన ఆటలా
నింగి అంచు తాకే అలలోని పాటల
మౌనం ఆలపించే నవరాగం ఎదో
ప్రాణం ఆలకించే ఆ ప్రాణం ఎదో
కొండవాగులోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు దాటి చిందులాడు ఒడిలో
కిందు మీదు లేని తొందరలో
నేనేనా నిజంగాన అనే భావం కలిగి

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

చరణం: 2
సొంత సోయగాలే బరువైన మేనిలో
వింత సౌరభాలే చిలికించు శ్వాసలో
ఉయ్యాలూపు గాలి లే లెమ్మన్నదా
వయ్యారాల కెలి రా  రమ్మన్నదా
ఇంత కాలమెన్ని సొంపులున్న శిల్పం
శిల వెనుకనే దాగుందా
ఇప్పుడేదో వింత స్వప్నం సంకల్పం
ముని పిలుపుగ తరిమిందా
సంకోచాల సంకెళ్లని తృటిలో కరిగే

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగుల చెరలను విడిచి
అది ఇదియని తలచి
అదుపెరగని మురిపెం పిలిచి
మధుర భవనల సుధల వాహిణిగ
ఎగసిన హృదయంతో

పున్నమి పువ్వై వికశిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా